»   » శ్రీయా పెళ్లి గుట్టు వీడింది.. వేదికపై భర్తకు ముద్దులతో ముంచెత్తిన శ్రీయ (వీడియో, ఫొటోలు)

శ్రీయా పెళ్లి గుట్టు వీడింది.. వేదికపై భర్తకు ముద్దులతో ముంచెత్తిన శ్రీయ (వీడియో, ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రీయా పెళ్లి గుట్టు వీడింది.. వేదికపై భర్తకు ముద్దులతో ముంచెత్తిన శ్రీయ

గత రెండు రోజులుగా శ్రీయా సరన్ పెళ్లిపై క్లారిటీ లేకపోవడంతో మీడియాలో రచ్చ రచ్చ అయింది. గ్లామర్ స్టార్ శ్రీయా సరన్ పెళ్లి వార్త అన్ని పరిశ్రమల్లోనూ సంచలనం రేపింది. మార్చి 12వ తేదీన గుట్టుచప్పుడు కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకొన్నారనే వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే తన పెళ్లిపై శ్రీయ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే సోమవారం అధికారికంగా తన పెళ్లి ఫోటోలను శ్రీయా మీడియాకు విడుదల చేయడంతో అనేక అనుమానాలకు చెక్ పెడింది.

 పెళ్లి తర్వాత ఫొటో ఇదే

పెళ్లి తర్వాత ఫొటో ఇదే

పెళ్లి అనంతరం శ్రీయా, అండ్రూ కొశ్చీవ్ కెమెరాకు ఫోజిచ్చారు. పెళ్లి వేడుకల్లో శ్రీయా తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిందనే విశ్వసనీయ సమాచారం.

 కళ్లలోకి కళ్లు పెట్టి చూసి

కళ్లలోకి కళ్లు పెట్టి చూసి

పెళ్లి తర్వాత ఒకరి కళ్లలోకి ప్రేమగా చూసుకొంటుండగా ఆ క్షణాల్ని కెమెరా క్లిక్ మనిపించింది. పక్కా హిందూ సంప్రదాయ పద్దతిలో శ్రీయా వివాహం జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన భార్యతో హాజరయ్యారు.

ముద్దులతో ముంచెత్తిన శ్రియ

పెళ్లికి తర్వాత ప్రమాణ పత్రాన్ని అండ్రూ కొశ్చీవ్ చదివి వినిపించారు. ప్రమాణ పత్రం చదువుతుండగా శ్రీయా తన భర్త పెదాలపై ముద్దు పెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీడియా వెబ్‌సైట్ల కథనాల ప్రకారం

మీడియా వెబ్‌సైట్ల కథనాల ప్రకారం

జాతీయ మీడియా వెబ్‌సైట్ల కథనాల ప్రకారం.. మార్చి 11న శ్రీయా పెళ్లికి సంబంధించిన సంగీత్, మెహందీ కార్యక్రమాలు జరిగాయి. తొలుత శ్రీయా వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతుంది అని ప్రచారం చేశారు. కానీ శ్రీయా సరన్ వివాహం ముంబైలోని తన లోఖండ్‌వాలా నివాసంలో మార్చి 12న మీడియా కంటపడకుండా జరిగింది.

మంచు విష్ణు కన్ఫర్మేషన్

మంచు విష్ణు కన్ఫర్మేషన్

ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన పెళ్లికి క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కొంత మందే హాజరయ్యారు. శ్రీయా నివాసానికి పక్కనే ఉండే హీరో మనోజ్ బాజ్‌పేయ్, ఆయన సతీమణి షబానా లాంటి కొందరు మాత్రమే హాజరయ్యారు అని మంచు విష్ణు వెల్లడించినట్టు పేర్కొన్నారు.

రష్యా వ్యాపారవేత్త.. క్రీడాకారుడు

రష్యా వ్యాపారవేత్త.. క్రీడాకారుడు

శ్రీయా సరన్ బాయ్‌ఫ్రెండ్ అండ్రి కృశ్చీవ్‌ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. అంతేకాకుండా ఆ దేశం తరఫున జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ కూడా. అతనికి రెస్టారెంట్ల వ్యాపారం ఉంది. 2015లో యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకొన్నారు.

ఏడేళ్లుగా అఫైర్

ఏడేళ్లుగా అఫైర్

గత ఏడేళ్లుగా అండ్రి కృశ్చేవ్‌, శ్రీయా మధ్య అఫైర్ కొనసాగుతున్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధించిన సమాచారాన్ని శ్రీయా అందజేస్తున్నారు. కానీ తన సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయకపోవడం గమనార్హం.

English summary
Shriya Saran married long-time Russian boyfriend Andrei Koscheev on March 12. It was an intimate affair in the presence of friends and family. The wedding was reportedly preceded by a pre-wedding party on March 11. Tollywood hero Vishnu Manchu is said to have tied the knot with her long-time Russian boyfriend Andrei Koscheev. Now Shriya photos are viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X