»   » "ఎ" సినిమాలో హీరో కి తల్లిగా... శ్రియ ఇలాయిపోయిందేంటీ..?

"ఎ" సినిమాలో హీరో కి తల్లిగా... శ్రియ ఇలాయిపోయిందేంటీ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రియ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రనాయికల్లో ఒకరు... అయితే కొంత కాలం గా సరైన అవకాశాల్లేక తెరకు దూరంగా వెళ్ళిపోయింది శ్రియ. దాదాపు గా జనం ఆమెను మర్చిపోయే దశలో అగ్రహీరో బాలకృష్ణ సరసన "గౌతమీ పుత్ర..."లో సెలక్టయ్యి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది. అయితే ఈ సినిమా తప్ప పెద్ద అవకాశాల్లేవు అనుకుంటున్న సమయం లో ఇంకో అవకాసం తలుపు తట్టింది.

అసలే చాన్సుల్లేవు అందులోనూ హీరోయిన్ అవకాశాలు దాదాపు ఇక లేనట్టే ఇలాంటి పరిస్థితుల్లో శ్రీయ తప్పదనుకుందో ఏమోగానీ సంచలన నటుడు శింబుకు అమ్మగా నటించడానికి ఒప్పుకుందట . శింబు తాజాగా "అన్బానవన్ అసరాదవన్ అదంగాదవన్" అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఆధిక్ రవిచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

shriya

ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న శింబు మూడు పాత్రల్లో...మూడు వేరు వేరు వయసుల్లో కనిపిస్తాడట. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్న విషయాన్ని సీక్రేట్ గానే ఉంచినా నడివయసులో ఉండే ఫాదర్ క్యారెక్టర్ సరసన నటించటానికి శ్రియ ని ఒప్పించారట. ఈ పాత్రకు జోడీగా మొదట చెన్నై చిన్నది త్రిషను సంప్రదించగా సింపుల్ గా నో చెప్పేసిందత ఆ పాత్రలోనే శ్రెయ మనకి కనిపించ్వ్హనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా ట్యూన్లందించే పనిలో ఉన్నాడట... కనీసం ఈ సినిమాలతో అయినా శ్రియ ఫామ్ లోకి వస్తుందా చూడాలి

Read more about: aaa simbu shriya శ్రియ
English summary
The team of ‘AAA’ had approached Trisha to play the pair for the middle aged character and she reportedly rejected the offer. Now the buzz is that Shriya Saran is on the verge of signing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu