»   » పెళ్ళికి సిద్దంగా ఉందట: బాలయ్య తో సినిమానే శ్రేయ కి చివరిదా??

పెళ్ళికి సిద్దంగా ఉందట: బాలయ్య తో సినిమానే శ్రేయ కి చివరిదా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు 15 ఏళ్ళ క్రితం సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రియ చాలాసార్లు ఇక కెరీర్ ముగిసినట్టే అనిపించుకుంటూనే మల్ళీ మళ్ళీ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. నేటికీ తన అందచందాలతో కుర్రకారు మతిపోగెట్టేస్తోంది హీరోయిన్ శ్రేయ. ఎన్నో ఒడుదొడుకులను అధిగమిస్తూ సుదీర్ఘ సినీప్రయాణం చేస్తున్న శ్రేయ తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో చాలా విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

'ఇష్టం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈభామ వచ్చిన అన్నిఅవకాశాలను ఒడిసిపట్టుకుంటూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో పాటు ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ లాంటి నేటితరం హీరోలతో సైతం చెట్టాపట్టాలేసింది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన 'శివాజీ' సినిమాలో జతకట్టి అందరిచేత భేష్ అనిపించుకుంది. కొద్దిరోజుల క్రితమే బాలయ్య సరసన 'పైసా వసూల్' షూటింగ్ పూర్తిచేసుకుంది శ్రేయ.

Shriya Saran Ready to get Married ?

ఈ నేపథ్యంలోఇటీవల ఓ ఇంటర్వ్యూ‌లో పాల్గొన్న శ్రేయ 'తాను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. నచ్చినవాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భర్త అన్ని విషయాల్లో ఓ స్నేహితుడి వలె తనకు అండదండగా ఉండాలని చెప్పుకొచ్చింది శ్రేయా. అంతేగాక స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవని' చెప్పింది. అదంతా సరే గానీ రెండేళ్లకిందట తమిళ బిజినెస్ మ్యాన్ తో ప్రేమా, పెళ్ళీ అంటూ వచ్చిన వార్తలమీద మాత్రం ఏం మాట్లాడలేదు...

English summary
shriya is in plans for her marriage and keeping all her present offers behind shriya try to go for marriage and settle in her career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu