»   » హీరోయిన్ శ్రీయ రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఇతడే, పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు...

హీరోయిన్ శ్రీయ రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఇతడే, పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ శ్రీయ... చూడటానికి పెద్దగా వయసు పైబడినట్లు కనిపించదు. పదిహేనేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎలా ఉందో ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా అదే గ్లామర్ మెయింటేన్ చేస్తోంది. కానీ అమ్మడి వయసు 35 క్రాస్ అయింది. ఇంతకంటే లేటయితే కష్టం కాబట్టి త్వరలో పెళ్లికి సిద్ధమవుతోంది. తను ప్రేమించిన వ్యక్తిని పరిణయమాడబోతోంది.

ఎప్పుడు మొదలైందో... చాలా సీక్రెట్

ఎప్పుడు మొదలైందో... చాలా సీక్రెట్

రెండు మూడు రోజులుగా శ్రీయ తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ అండ్రీ కోశ్చేవ్‌‌ను పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ చాలా కాలంగా వీరి ఎఫైర్ రహస్యంగా నడిచినట్లు తెలుస్తోంది. తాజాగా అతగాడి గురించిన ఫోటోలు, వివరాలు బయటకు వచ్చాయి.

ఎవరీ అండ్రీ కోశ్చేవ్‌?

ఎవరీ అండ్రీ కోశ్చేవ్‌?

శ్రీయ బాయ్ ఫ్రెండ్ అండ్రీ కోశ్చేవ్‌ రష్యన్ ఎంట్రెప్రెన్యూర్. టెన్నిస్ ప్లేయర్ కూడా. రష్యాలో నేషనల్ లెవల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్న అనుభవం అతడికి ఉంది.

 రెస్టారెంట్ వ్యాపారం

రెస్టారెంట్ వ్యాపారం

అండ్రీ కోశ్చేవ్‌ రెస్టారెంట్ వ్యాపారం కూడా ఉంది. రష్యాలో పాపులర్ అయిన ‘డొమావ్‌కుస్నీ' అనే రెస్టారెంటు చైన్‌కు అండ్రీ కోశ్చేవ్‌ వ్యవస్థాపకుడు. ఈ రెస్టారెంట్ చైన్ కస్టమ్‌మేడ్ మెను, రెసిపీ తయారు చేస్తుంది. కస్టమర్లు కోరిన వంటలు వండి డెలివరీ చేస్తుంది.

 అల్లా టప్పా వ్యక్తి కాదు

అల్లా టప్పా వ్యక్తి కాదు

అండ్రీ కోశ్చేవ్‌... అల్లా టప్పా ఎంట్రెప్రెన్యూర్ కాదు, మంచి టాలెంట్ ఉన్నోడే. 2015లో బెస్ట్ ఎంట్రెప్రెన్యూర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

 రష్యాలో ఎక్కడ అంటే..

రష్యాలో ఎక్కడ అంటే..

అండ్రీ కోశ్చేవ్‌... రష్యాలో సెయింట్ పీటర్‌బర్గ్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం అతడు తన తల్లి నటాల్యా కోశ్చేవ్‌, బ్రదర్ నికిటా కోశ్చేవ్‌తో కలిసి ఉంటున్నాడు.

 ఉదయ్‌పూర్లో వివాహం

ఉదయ్‌పూర్లో వివాహం

శ్రీయ-అండ్రీ కోశ్చేవ్‌ వివాహం రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు వీరి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రాండ్‌గా జరుగబోతోందట.

 సినిమా ప్రముఖులంతా

సినిమా ప్రముఖులంతా

శ్రీయ పెళ్లి వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. మరి పెళ్లి తర్వాత శ్రీయ సినిమాల్లో కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

 ఈ సారి పక్కా...

ఈ సారి పక్కా...

గతంలో శ్రీయ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చినపుడు ఆమె తల్లి ఖండించారు. బట్టలు, చీరలు కొన్నది నిజమే కానీ.... శ్రీయ పెళ్లి కాదని, స్నేహితులు, బంధువుల వివాహం కోసమే అని ఆమె దాట వేశారు. అయితే ఈ సారి మాత్రం శ్రీయ తల్లి ఆ వార్తలను ఖండించలేదు. సో శ్రీయ వివాహం పక్కా అని తేలిపోయింది.

English summary
Shriya Saran is tying the knot with her Russian boyfriend Andrei Koscheev in Udaipur this month, confirmed reliable sources close to her. Andrei Koscheev is a Russian entrepreneur and a tennis player who has taken part in national-level championships.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu