»   » మట్టి ముద్దలా మారి సహకరిస్తా...శ్రియ

మట్టి ముద్దలా మారి సహకరిస్తా...శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకరకంగా చెప్పాలంటే నేను మట్టి ముద్దలాంటిదాన్ని. పాత్రకు తగ్గట్టు ఎలా కావాలంటే అలా ఒదిగిపోతాను అంటోంది శ్రియ. ప్రస్తుతం రవితేజ సరసన 'డాన్‌ శీను' చిత్రంలో నటిస్తున్న ఆమె కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటించడంపట్ల తన ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది. తెలుగు సినిమాల షూటింగ్స్‌లో ఉన్నప్పుడు భాష నేర్చుకోవడం కోసం తెలుగులో మాట్లాడటానికి శ్రియ ట్రై చేస్తానంటోంది. ఓ మలయాళ చిత్రంలో కూడా నటిస్తున్నఆమె ఆ భాష నేర్చుకుంటున్నానని చెప్తోంది. అలాగే తాను ఏకసంద్రాగ్రహిని కాబట్టి గ్రహింపు శక్తి ఎక్కువని భాషను ఇట్టే పట్టేయగలుగుతానని కూడా ఆమె వివరిస్తోంది. ముంబయిలో పుట్టి, పెరిగినందువల్ల దక్షిణాది భాషలు పలకడం చాలా కష్టంగా అనిపిస్తుంది.అయితే ఉత్తరాదికన్నా దక్షిణాదిలోనే తన కెరీర్‌ బాగున్నందున పట్టుబట్టి భాష నేర్చుకున్నాను...భవిష్యత్‌లో డబ్బింగ్‌ కూడా చెబుతాను అని హామీ ఇస్తోంది. ఇక ఆమె పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో ఓ ఐటం సాంగ్ కూడా చేస్తోంది.ఇక డాన్ శీను చిత్రాన్ని గోపీచంద్ మలినేని అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu