»   » ‘రామయ్యా వస్తావయ్య’ లో శ్రుతి హాసన్ క్యారెక్టర్

‘రామయ్యా వస్తావయ్య’ లో శ్రుతి హాసన్ క్యారెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కధను మలుపు తిప్పే పాత్రను చేస్తోంది. ఆమె పాత్ర సినిమాకు, తన కెరీర్ కు కీలకమై నిలుస్తుందని చెప్తోంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉంది శ్రుతి. ఆ సినిమాలో శ్రుతి పోషించిన పాత్ర పేరు 'అమ్ములు'. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయని, తనకు వెంటవెంటనే వస్తున్నాయని ఆమె చెప్తోంది.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.... '''గబ్బర్‌సింగ్'లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న 'రామయ్యా వస్తావయ్య'లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర పేరు 'అమ్ములు'. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. 'గబ్బర్‌సింగ్'లో సెలైంట్‌గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్‌శంకర్‌కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్‌నే మార్చేశారాయన'' అంది.

'రామయ్యా వస్తావయ్య' చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary

 Ramayya Vasthavayya movie has been directed by Harish Shankar. Shruthi is portraying the character of Ammulu in the film and Harish Shankar has thanked the actress for living up to the character so well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu