»   »  పవన్ తో హిట్ ఇచ్చాడన్న గౌరవంతో...

పవన్ తో హిట్ ఇచ్చాడన్న గౌరవంతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :ఎన్టీఆర్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'రామయ్యా...వస్తావయ్యా'. ఈ చిత్రంలో శృతిహాసన్ నెగెటివ్ రోల్‌లో నటిస్తోందని, విలన్‌గా ఆమె నటన అద్భుతమని అంతటా ఆ మధ్య వినిపించాయి. అయితే ఈ ప్రచారాన్ని శృతిహాసన్ కూడా ఖండించింది. అందరూ అనుకున్నట్లుగా తాను 'రామయ్యా...వస్తావయ్యా'లో విలన్‌గా నటించలేదని, ఓ స్పెషల్ కారెక్టర్‌లో గెస్ట్‌గా మాత్రమే నటించానని అంది.

అయితే ఆ పాత్ర సినిమా కథకు ప్రధానంగా ఉంటుంది కనుక తన అభిమానులకు నచ్చుతుందని, మెయిన్ హీరోయిన్‌గా సమంతే ఉందని చెప్పింది. గతంలో దర్శకుడే ఈ విషయంలో ఇద్దరు హీరోయిన్లని అందరికీ చెప్పాడు. శృతిహాసన్ తాజాగా చెప్పిన స్టేట్‌మెంట్‌తో దర్శకుడు ఇన్నాళ్లు ప్రేక్షకులను ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని మభ్యపెట్టాడని బయటపడుతోంది. దర్శకుడిపై ఉన్న అభిమానంతో, తనకు తొలిసారిగా పవన్ కళ్యాణ్‌తో హిట్ ఇచ్చాడన్న గౌరవంతో తానీ చిత్రంలో నటించానని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.... '''గబ్బర్‌సింగ్'లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న 'రామయ్యా వస్తావయ్య'లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర పేరు 'అమ్ములు'. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. 'గబ్బర్‌సింగ్'లో సెలైంట్‌గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్‌శంకర్‌కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్‌నే మార్చేశారాయన'' అంది.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
Sruthi Hassan Says... “Contrary to reports I’m not playing a negative role in RVV its a special guest appearance and I hope you all enjoy the film and character!!”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu