»   » ఆత్మహత్య పాల్పడాలనే ఆలోచనలు రాకుండా శ్రుతిహాసన్

ఆత్మహత్య పాల్పడాలనే ఆలోచనలు రాకుండా శ్రుతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రుతిహాసన్ కేవలం అందగత్తే మాత్రమే కాదు, ఆమె మంచి నటి. అంతేనా..ఆమె తన తండ్రి కమల్ లా మల్టి టాలెంటెడ్. తన అందచందాలతో, నటనా సామర్ధ్యంతో వెండితెరపై అదరకొట్టే ఆమె సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా ఆమె తనదైన ముద్రను ఇప్పటికే వేసుకున్నారు. అంతేనా..

ఇప్పుడు ఆమె తనలోని లిరిక్ రైటర్ ని బయిటకు ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. అలాగని ఓ పాటను రాసేసి ఏ ట్విట్టర్ లోనే, ఫేస్ బుక్ లోనే పెట్టాలనుకోవటంలేదు. తన పాటను మహిళలలు అందరూ పాడుకోవాలని ఆకాంక్షిస్తోంది. అందులో భాగంగా ఆమె యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది.

స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారని చెప్తున్నారు. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు.

స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా.

ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌'లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌' మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహంహీరోగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

English summary
Shruthi Haasan has collaborated with popular musical duo Ehsaan and Roy who will be composing tunes for special song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu