»   » వ్యానిటీ వేన్ లో శ్రుతి హాసన్ ఇలా...(ఫొటో)

వ్యానిటీ వేన్ లో శ్రుతి హాసన్ ఇలా...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆర్టిస్టులు రకరకాల ఎక్సప్రెషన్స్ ఇస్తూంటారు. అయితే ఇంతకు ముందు అవి...కేవలం ఆ యూనిట్ వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని...తన అభిమానులలో ఆ క్షణమే పంచుకుంటున్నారు. ఆగడు చిత్రంలో ఐటం సాంగ్ పూర్తి చేసిన శృతిహాసన్...తర్వాత తన వేనిటీ వ్యాన్ లో కూర్చుని ఇలా ఫోజిచ్చింది.

ఇక శ్రుతి 'ఆగడు' సినిమా కోసం ఓ పాట పాడింది. ''శ్రుతి గొంతులోంచి మరో ప్రత్యేకమైన గీతం దూసుకొస్తోంది'' అంటూ ఈ పాట గురించి చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఓ వైపు నాయికగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే గాయనిగానూ మంచి పేరు తెచ్చుకుంటోంది శ్రుతి.

Shruthi Madness at Aagadu sets

సంగీతమంటే శ్రుతి హాసన్‌కు ప్రాణం. పుట్టిన ఆరేళ్లకే గాయనిగా మారింది. సమయం దొరికితే చాలు పాటల వింటూ గడిపేస్తుంటుంది. అలా ఈ మధ్య మలయాళం పాటలు విన్నట్లుంది. అందుకే ''మలయాళం పాటలు చాలా బాగుంటాయి. నేనూ ఈ భాషలో ఓ పాట పాడితే బాగుంటుంది. అయితే పదాలను సరిగ్గా పలకగలనో లేదో'' అంటూ తన మనసులో మాటను ట్విట్టర్‌ ద్వారా వెలిబుచ్చింది శ్రుతి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 26 పాటలు పాడిన ఈ భామకి ఇదో కొత్త కోరిక. మరి ఏ సంగీత దర్శకుడు ఈ అవకాశాన్నిస్తోరో చూడాలి.

English summary
Shruti Haasan posted a selfie picture stating, “Vanity van madness... long day dance. just for jolly and fun.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu