»   »  శ్రుతి హాసన్ సైతం "రేసు గుర్రం" పై అదే కామెంట్

శ్రుతి హాసన్ సైతం "రేసు గుర్రం" పై అదే కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shruthi’s comment on Kill Bill Pandey !
హైదరాబాద్: అల్లు అర్జున్,శ్రుతి హాసన్ కాంబినేషన్ లో రూపొందిన "రేసు గుర్రం" మార్నింగ్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం బ్రహ్మానందం కొట్టేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీన్ని శృతి హాసన్ సైతం ఖరారు చేస్తున్నట్లుగా ట్వీట్ చేసింది. కిల్ బిల్ పాండేగా చేసిన బ్రహ్మానందం ఎపిసోడ్ ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేసింది.

శృతి ట్వీట్ లో..." కిల్ బిల్ పాండే రాక్స్ !!!!!!!!! హ..హ..హ..హ...ఆసమ్ ఎపిక్ సూపర్ డూపర్ ఫన్నీ ". ఇది చదివినవాళ్లు ఆమె నిజాయితీగా సినిమాలో ఆ ఎపిసోడ్ కి వస్తున్న స్పందనని గమనించి ఈ ట్వీట్ చేసిందని మెచ్చుకుంటున్నారు. తన డాన్స్ లు బాగున్నాయనో, లేక అల్లు అర్జున్ అదరకొట్టాడనో రాయకుండా ఇలా ట్వీట్ చేయటం చాలా మందికి నచ్చుతోంది.

ఇక మొదటి రోజు సినిమా చూసిన రాజమౌళి సైతం కిల్ పాండే పాత్రకే మార్కులు వేస్తూ ట్వీట్ చేసారు. ఇలా అందరి ఆదరాభిమానాలు పొందుతోంది ఈ పాత్ర. సల్మాన్ దబాంగ్ చిత్రంలో పాత్ర కు ప్యారెడీగా ఈ పాత్రను డిజైన్ చేసారు. ఇక సినిమా చివరి ఇరవై నిముషాలు లేకపోతే ఈ రిజల్ట్ రాకపోను అని..ఇది పూర్తిగా బ్రహ్మి నిలబెట్టిన చిత్రం అని అంతటా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ హీరో అయినా బ్రహ్మానందం కే ఈ చిత్రం క్రెడిట్ పూర్తిగా వెళ్ళిపోతోంది.

కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
Shruthi Haasan also revealed her opinion on Kill Bill Pandey. She posted this on her micro blogging site saying “Kill bill pandey rocks!!!!!!!!! Hahahahaha awesome epic super duper funny”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu