»   » శృతిహాసన్ తనకు తనే ఖరీదైన గిప్ట్ ఇచ్చేసుకుంది

శృతిహాసన్ తనకు తనే ఖరీదైన గిప్ట్ ఇచ్చేసుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శృతిహాసన్ ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. సౌత్ లో మహేష్ సరసన శ్రీమంతుడు, విజయ్ సరసన పులి చిత్రాలు చేస్తోంది. మరో ప్రక్క హిందీలో రీసెంట్ గా అక్షయ్ తో గబ్బర్ చేసేసింది. దాంతో ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. వీటిని పురస్కరించుకుని ఆమె తనకు తానే ఓ ఖరీదైన గిప్ట్ ని ఇచ్చేసుకుంది. అది మరేదో కాదు...రేంజ్ రోవర్ కారు. తను సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కోవటం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శృతి హాసన్ మాట్లాడుతూ... ''దేవుడిచ్చిన జీవితమే అన్నింటికంటే గొప్పది. మధ్యలో వచ్చే విజయాలు, కీర్తిప్రతిష్ఠలూ ఇవన్నీ బోనస్‌ మాత్రమే'' అంటోంది శ్రుతి హాసన్‌. ఏమిటీ వేదాంతం అని అడిగితే ''వేదాంతం కాదు. ఇదే నిజం. జీవితం కంటే గొప్పది మరోటి ఉందంటే నేను నమ్మను'' అని చెప్పుతోంది.

Shruti Haasan gifts herself a Luxury Item

అలాగే...చిన్న చిన్న విషయాలకే జీవితంపై విరక్తి పెంచుకొనేవాళ్లని చూస్తుంటాం. వాళ్లందరికీ జీవితం విలువ చెప్పాలనిపిస్తుంటుంది. గెలిచినా, ఓడినా ఆ భావోద్వేగాలు కాసేపే. వాటికోసం అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు'' అంది.

ఇక జీవితం పట్ల ఈ తరం కాస్త బాగానే ఆలోచిస్తోందని, పుస్తకాల ద్వారా, వ్యక్తిత్వ వికాస మార్గాల ద్వారా ఓ సరికొత్త దృక్పథాన్ని అలవర్చుకొంటున్నారని చెబుతోంది శ్రుతి. ''ఈ తరానికి జీవితం పట్ల భయం, బాధ్యత రెండూ ఉన్నాయి. అవి అవసరం కూడా. జీవితంలో ప్రతి క్షణం సద్వినియోగం చేసుకొన్న వాళ్లు ఎంతో సాధించినట్టే లెక్క'' అంటోంది శ్రుతి హాసన్‌.

English summary
Shruti Haasan gifted herself a red Range Rover which is as gorgeous as her.
Please Wait while comments are loading...