»   » శ్రుతి హాసన్‌, కమల్ హాసన్..కలిసి డాన్స్ (వీడియో)

శ్రుతి హాసన్‌, కమల్ హాసన్..కలిసి డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:కమల్‌, శ్రుతిలు ఆదివారం చెన్నైలో జరిగిన అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తండ్రీకూతుళ్లు స్టేజిపై స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కమల్‌ హాసన్‌ నటించిన 'మైకేల్‌ మదన్‌ కామరాజ్‌' సినిమాలోని హిట్‌ సాంగ్‌ 'రమ్‌ బమ్‌ బమ్‌ ఆరంబమ్‌.. ' పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు.

తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి స్టేజ్‌పై స్టెప్పులు వేయడం చాలా ఆనందంగా ఉందని.. అది తనకు ఎంతో ప్రత్యేకమైందని కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతి హాసన్‌ ట్వీట్‌ చేశారు.

ఆ వీడియో మీరు ఇక్కడ చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శృతిహాసన్... కెరీర్ విషయానికి వస్తే...

ప్రస్తుతం శృతి హాసన్... మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో చేస్తోంది. అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న గబ్బర్ చిత్రం(ఠాగూర్ రీమేక్)లోనూ ఆమె హీరోయిన్ గా చేసి ,ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇలా వరసగా బిజిగ ఉన్న ఆమె కార్తి,నాగార్జున ప్రాజెక్టులో కొనసాగుతుందో లేదో చూడాలి.

Shruti Haasan & Kamal Dances Together

శృతి హాసన్ మాట్లాడుతూ...''ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు. హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు. ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం. కానీ ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం. నా కెరీర్‌లో విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది.

English summary
At 9th Vijay Awards Shruti Haasan & Kamal Dances Together.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu