»   »  బ్రే(షా)కింగ్ న్యూస్: సంఘమిత్ర నుండి శృతి హాసన్ ఔట్

బ్రే(షా)కింగ్ న్యూస్: సంఘమిత్ర నుండి శృతి హాసన్ ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, రజనీ 2.0 స్థాయిలో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న 'సంఘమిత్ర' మూవీ ప్రాజెక్టుకు సంబంధించి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు నుండి శృతి హాసన్ తప్పుకుంది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 'శ్రీ థెనండాల్ ఫిల్మ్స్' తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించింది. 'అనివార్యమైన పరిస్థితుల కారణంగా సంఘమిత్ర సినిమాను హీరోయిన్ శృతి హాసన్ తో కొనసాగించలేక పోతున్నాం' అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సంఘమిత్ర' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేసారు. శృతి హాసన్ గుర్రం స్వారీ చేస్తున్న ఫోటోతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇంతలోనే శృతి హాసన్ ఈ సినిమాకు దూరం కావడం చర్చనీయాంశం అయింది.

తప్పించారా? తప్పుకుందా?

అసలు ఈ సినిమా నుండి శృతి హాసనే తప్పకుందా? లేక ఆమెతో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం వల్ల చిత్ర దర్శక నిర్మాతలే ఆమెను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.

రూ. 450 కోట్ల బడ్జెట్

రూ. 450 కోట్ల బడ్జెట్

ఈ చిత్రాన్ని రూ. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాహుబ‌లి2, 2.0 చిత్రాల‌ు మాత్రమే ఇండియాలో ఈ రేంజి బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆర్య‌, జ‌యం ర‌వి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమాను ప్లాన్ చేసారు. కానీ ఇంతలోనే శతి హాసన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం చర్చనీయాంశం అయింది.

త్వరలో మరో హీరోయిన్

త్వరలో మరో హీరోయిన్

సినిమా టైటిల్ రోల్ చేస్తున్న శృతి హాసన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సంఘ‌మిత్ర చిత్రం వ‌చ్చే ఏడాది పట్టాల‌పైకి వెళ్ళ‌నుండ‌గా, ఈ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.

English summary
"Due to unavoidable circumstances, we are unable to proceed working with Shruti Haasan in Sangamithra." Sri Thenandal Films tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu