»   » శ్రుతీహాసన్ మరీ ఇంత చెత్తగానా? పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి

శ్రుతీహాసన్ మరీ ఇంత చెత్తగానా? పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి శ్రుతిహాసన్ తన అందాన్ని పట్టించుకోవడం లేదనే వాదనకు కాటమరాయుడు చిత్రం మరింత బలాన్ని చేకూర్చింది. గబ్బర్ సింగ్ తర్వాత తాజాగా మరోసారి కాటమరాయుడు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ అందంగా కనిపించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీగ్లామరైజ్డ్‌గా

డీగ్లామరైజ్డ్‌గా

కాటమరాయుడు చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా, పాటల్లోనూ డీ గ్లామర్‌గా కనిపించిందని అభిమానులు వాపోతున్నారు. పవన్ పక్కన శృతి తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 వాడిపోయి.. వయసు మీద పడినట్టు

వాడిపోయి.. వయసు మీద పడినట్టు

మంచి జోష్‌గా సాగే పాటల్లో శ్రుతీహసన్ సాదాసీదాగా కనిపించిందని, ముఖం వాడిపోయినట్టు, వయసు మీద పడినట్టు కనిపించింది. గబ్బర్ సింగ్ చిత్రంతో పోల్చితే పవన్, శ్రుతిల కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదని సినీజనాలు గుసగుసలాడుతున్నారు.

కెరీర్‌కే ముప్పుగా..

కెరీర్‌కే ముప్పుగా..

అందంపై సరైన దృష్టి పెట్టకపోతే కెరీర్‌కు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గ్లామర్ పరంగాను, క్యాస్టూమ్స్ పరంగాను తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందనే మాట వినిపిస్తున్నది.

అలా ఉండటం నా వల్ల కాదు..

అలా ఉండటం నా వల్ల కాదు..

సక్సెస్ వస్తే ఒకలాగా, ఫెయిల్యూర్ వస్తే మరోలా వ్యవహరించే అలవాటు నాకు లేదనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ‘కాటమరాయుడు'తో సందడి చేస్తున్న శ్రుతిహాసన్‌ ఇటీవల దక్షిణాది చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. హీరోయిన్‌గా కెరీర్‌లో జయాపజయాలకు బాధ్యత నాదే అని ఆమె అన్నారు.

English summary
Shruti Haasan disappointed Power star Pawan Kalyan's fans. she totally appeared in get wet mode for Katamarayudu. Shruti lost her glamour quotient these days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu