»   » యూనివర్సల్ హీరో కూతురుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రొమాన్స్...!

యూనివర్సల్ హీరో కూతురుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రొమాన్స్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలి సినిమా ఫ్లాప్ అయితే, ఇక చాలా మంది కెరీర్ ముందుకు సాగదు. ఇందుకు భిన్నంగా శృతి హాసన్ కెరీర్ దూసుకుపోతోంది. ఆమె తొలి సినిమా 'అనగనగా ఓ ధీరుడు' ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు టాలీవుడ్ ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా సినిమాలు చేస్తూ బిజీగానే వుంది.

తెలుగులో సిద్ధార్థ్ తో 'ఓ మై ఫ్రెండ్', ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో భారీ ఆఫర్ తన సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందింది. ఆ సినిమా ఏదనేది మాత్రం ఇంకా వెల్లడికాకపోయినప్పటికీ, రాజు సుందరం డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటించే సినిమా అని అంటున్నారు. ప్రస్తుతం 'కాళీ", 'గబ్బర్ సింగ్" అలాగే సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న 'ట్రాఫిక్ జామ్" చిత్రాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల తర్వాత రాజుసుందరం దర్శకత్వంలో నటించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుందని వినికిడి. కాగా ఈ సినిమాకి కమల్ హాసన్ డాటర్ 'శృతి హాసన్" ని హీరోయిన్ గా ఎంపిక చేసారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం కూడా తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుందని వినికిడి. కాగా ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ డాటర్ 'శృతి హాసన్" ని హీరోయిన్ గా నటించనుందని వినికిడి. దీన్ని బట్టి చూస్తే ఏమైనా, శృతి హాసన్ కి తెలుగులో కెరీర్ బాగుందనే చెప్పాలి.

English summary
Kamal Hassan is known for his innovative skills in the film industry and he is one of the most admired personalities. His daughter Shruti Hassan has been making headlines in the recent days as a rock star and Bollywood actress. Latest buzz is she is going to romance with Pawar star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu