»   »  గంటలోనే: శృతిహాసన్ టాలెంట్ చూసి షాక్

గంటలోనే: శృతిహాసన్ టాలెంట్ చూసి షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు శృతి హాసన్ మ్యూజిక్ డైరెక్టరుగా, సింగర్ గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటు దక్షిణాది సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న శృతి హాసన్ తను నటిస్తున్న బాలీవుడ్ సినిమాలో పాట పాడింది. ఆ పాటకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.

శృతిహాసన్ నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్‌' కోసం ఓ సాంగ్ ను పాడింది. శృతి పాడిన పాట ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక గంట సమయంలో రికార్డింగ్ పూర్తి చేసిందట. శృతి నటిస్తున్న తమిళ్‌ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతుంది. పొల్లాచ్చిలో షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్లలేదట. అక్కడి నుంచి నేరుగా ముంబయిలోని రికార్డింగా థియేటర్‌కు చేరుకుని కేవలం హాఫ్ డే లోనే ఎలాంటి బ్రేకు లేకుండా ఈ సాంగ్ ను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Shruti Hassan records song for 'Gabbar Is Back' in one hour

ప్రస్తుతం శృతి హాసన్ నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే....బాలీవుడ్ నాలుగు సినిమాలు, తమిళంలో ఒకటి, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తెలుగు ఆమె మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇక బాలీవుడ్లో యాత్ర, వెల్ కం బ్యాక్, గబ్బర్ ఈజ్ బ్యాక్, రాకీ హాండ్సమ్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో ‘పులి' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ సంతృప్తి కరంగా సాగుతోంది.

English summary
After lending her voice to two successful songs - 'Joganiyan' and 'Sannata' earlier this year, Shruti Haasan has now sung a song that is picturised on herself for her film 'Gabbar Is Back'. What is even more incredible is that she recorded the song in one hour, without any break.
Please Wait while comments are loading...