ది బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఆమెనే
ప్రపంచ కధానాయకుడు కమల్ హసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ బాలీవుడ్ లో అదృష్టం కలిసిరాలేకపోయినా టాలీవుడ్ లో మాత్రం శృతిహసన్ కు లక్ బాగానే కలిసొస్తుంది. తోలిచిత్రం 'అనగనగా ఓ ధీరుడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలకు వచ్చిన డోకా ఏమి లేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంతో పాటు సిద్దార్ద్ తో 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో మరోసారి జతకడుతుంది. దీంతో పాటు ఈ అందాల సుందరికి మరో క్రేజీ ఆఫర్ వరించిందని తెలిసింది. 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన పూరి జగన్నాధ్ మహేష్ తో రూపొందించబోయే 'ది బిజినెస్ మెన్' చిత్రంలో ఈ ప్రిన్స్ సరసన శృతి హసన్ రోమాన్స్ చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఈ చిత్రంలో శృతి పాత్ర పూర్తి గ్లామరస్ గా ఉంటుందట. 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్' అనే ఉపశీర్షికతో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తారు.


Click it and Unblock the Notifications











