»   » మా ఇద్దరికీ పెళ్ళేమిటి?? ఫేస్ బుక్ లో ఆ ఫొటోలపై హీరోయిన్ ఆగ్రహం

మా ఇద్దరికీ పెళ్ళేమిటి?? ఫేస్ బుక్ లో ఆ ఫొటోలపై హీరోయిన్ ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ ఇండస్ట్రీ అంటేనే గాసిప్ ల మయం ఏ హీరోయిన్ అయినా మరొక నటుడితో కాస్త క్లోజ్ గా కనిపించిందా ఇక అంతే ఇద్దరి మధ్యా ఏదో ఉందీ అంటూ వార్తలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాగే కన్నడ టాప్ హీరోయిన్ శోభా పూంజా మీద కూడా ఒక రూమర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది...

క‌న్న‌డంలో మంచి న‌టిగా గుర్తింపు పొందిన న‌టి శోభా పూంజా అంద‌రికీ సుప‌రిచ‌త‌మ‌యిన అందాల తార‌. ఈమె చేసిన సినిమాలు క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అవ్వ‌డంతో ఆమెకు అక్క‌డ మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇటీవ‌ల కన్నడ చిత్ర నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌లు వివాహం చేసుకున్నారనంటూ కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోల‌ను చూసిన వీరి అభిమానులు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ వారి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు చేసేస్తున్నారు..

Shubha Poonja, Nagendra Prasad

అయితే ఈ ఫొటోలని చూసుకున్న ఈ ఇద్దరూ షాక్ తిన్నారట. అసలు తామిస్ద్దరికీ వివాహం ఏమిటంటూ అసలు సంగతేమిటో వివరించారు. ఈ ఫొటోల‌పై నాగేంద్ర‌ప్ర‌సాద్ స్పందించారు. తనకు ఇదివరకే వివాహమైందని, ఇవేమి తెలియని కొంతమంది శుభా పూంజాతో తనకు వివాహమైనట్టు ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతలో ఇదే విషయం లో శోభా కూడా వెంటనే స్పందించింది. ఇంత పీక్స్ లో కెరీర్ నడుస్తున్నప్పుడు అలాంటి పిచ్చి నిర్ణయం తాను తీసుకోననీ, అందరికీ చెప్పి చేసుకుంటాను త్తప్ప ఇలా రహస్య వివాహం చేసుకునే అవసరం తనకు లేదంటూ వివరణ ఇచ్వ్చింది.తనకు ఎవరితోనూ వివాహం కాలేదని, ఇది ఎవరో కావాలని ఇలా చేస్తున్నార‌ని, తనను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నార‌ని చెప్పిన ఈ నటి అసలు విషయాన్ని చెప్పింది.

ఫేస్ బుక్ లో పెట్టిన ఆ ఫొటో ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నాగేంద్ర ప్రసాద్ తో కలిసి నటిస్తున్న స్టిల్ అనీ చెప్పి సస్పెన్స్ ని క్లియర్ చేసింది. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగానే తామిద్దరికి పెళ్లయినట్ట న‌టించ‌డం జ‌రిగింద‌ని.... అంతేకాని ఇటువంటి పుకార్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని శుభా పూంజా చెప్పింది పాపం హీరోయిన్లకి ఎన్ని కష్టాలో...

English summary
Kannada Actress Shubha Punja and Director V. Nagendra Prasad Marriage Photo has been leaked in Social Media, but is it True Marriage? What Shubha Punja and Nagendra Prasad Answer for this Marriage Photo?
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu