For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్, సెక్సీ, వైల్డ్ ఏమిటీ మాటలు?? అమితాబ్ కూతురి లేఖ

  |

  సినీ పరిశ్రమ ఒక కళా రంగం గా కాక కేవలం గ్లామర్ ఫీల్డ్ గా మారి చాలా కాలమే అయ్యింది. ఒక సెలబ్రిటీ నటి లేదా నటుడి వరకే ఈ తరహా వైఖరి తో ఆగలేదు. సినీ సెలబ్రిటీల పిల్లల మీద కూడా ఆ ప్రభావం పడుతూనే ఉంది. వారి ప్రైవేటు జీవితాల్ల్లో వేసుకునే దుస్తుల గురించీ, వారి స్నేహితుల గురించీ రక రకాల వ్యాఖ్యానాలూ, రూమర్లూ సర్వసాధారణమైపోయాయి... సినిమారంగం లో ఉన్న వారి కుటుంబసభ్య్ల మీద కూడా మేడియా నిఘా మరీ హద్దులు దాటుతోందన్న విమర్శలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి.

  ఆమధ్య శ్రీదేవి కూతురు బాయ్ ఫ్రెండ్స్ గురించీ... అమితాబ్ మనవరాలు నవ్య నవేలీ బికినీ లో ఫ్రెండ్స్ తో కలిసి చేసుకున్న పార్టీ గురించీ వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఆ పార్టీలో షారూఖ్ ఖాన్ కొడుకు ఉండతం తో మరింతగా ఆ వార్త మీదకి అందరిదృస్టీ మళ్ళింది. అయితే ఈ విశయం లోనే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేత బచ్చన్ నంద స్పందించారు. ఆమె మీడియాని ఉద్దేశిస్తూ ఒక లేఖ ని రాసారు. ఇంతకీ ఏం జరిగింది?? శ్వేత ని అంతగా భాద పెట్టేలా వచ్చిన ఆ వార్త ఏమిటీ అంటే...

  నవ్య నవేలి:

  నవ్య నవేలి:

  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి, సూపర్ స్టార్ షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ లండన్ లోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో చదువుతూ ఇటీవలే గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు. చదువు పూర్తి కావడంతో ఈ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్లో గడపటానుకి ప్లాన్ చేసుకున్నారు. నవ్య నవేలి, ఆర్యన్ ఖాన్ తో పాటు వారి స్నేహితులంతా కూడా వివిధ దేశాలకు చెందిన సంపన్న వర్గానికి చెందిన పిల్లలే కావడంతో ఖరీదైన ఓ క్రూయిజ్ షిప్ లో సముద్రంలో ఓ జాలీ ట్రిప్ ప్లాన్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వారి స్నేహితుల సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

  ఊహించ లేక పోయింది:

  ఊహించ లేక పోయింది:

  నవ్య నవేలి బికినీలో డాన్స్ చేస్తున్న వీడియో కూడా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది.అయితే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన పిల్లల మీద అందరి దృష్టీ ఎలా ఉంటుందో ఆమె ఊహించ లేక పోయింది. నవ్య నవేలి చాలా అందంగా ఉందని, ఆమె సినిమాల్లోకి వస్తే బావుంటుందనే అభిప్రాయాలతో పాటు. ఆమె చాలా సెక్సీ గా ఉందనీ... మరింత ముదుకు కూడా వెళ్ళి ఆమె శరీరం మీద రకరకాల కామెంట్లు చేసారు. దీనికి లక్షలాది లైకులు, వేలాది కామెంట్స్ తో పాటు సినీ పత్రికల్లోనూ, వెబ్సైట్ల లోనూ ఈ ఫొటోలనీ వీడియోలనీ పెట్టి కథనాలు వెలువడ్డాయి.

  పెద్ద కలకలమే రేపింది:

  పెద్ద కలకలమే రేపింది:

  సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నవ్య కొన్ని సంచలన ఫోటోలను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారడం కామనే. ఇటీవలే ఆమె 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. దీంతోపాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో లండన్ లోనే చదువుకుంటున్న షారుక్ తనయుడు ఆర్యన్ ఎక్కువగా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఓ వీడియో కూడా వీరికి సంబంధించి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది పెద్ద కలకలమే రేపింది.

  శిఖర్ పహారియా :

  శిఖర్ పహారియా :

  ఇది అంతటితోనే ఆగలేదు అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవికి ముద్దులు పెడుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలితో జత కట్టిన ఫోటోలను తాజాగా పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మరింత గా హల్ చల్ చేసాయి. దాంతో అమితాబ్ మనవరాలు అన్న సెలబ్రిటీ హోదా ఉన్న నవ్య జనం నోళ్లలో నానింది.

  చనువుగా ఉన్న ఫోటోలు:

  చనువుగా ఉన్న ఫోటోలు:

  అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందాతో శిఖర్ చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, శ్రీదేవి కుమార్తె జాహ్నవితో లిప్‌లాక్ చేసిన ఫొటోతో వార్తల్లో కెక్కిన శిఖర్ తాజాగా బిగ్ బీ మనవరాలితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అందరినీ ఆకర్షించేందుకు యత్నిస్తున్నాడని నెటిజన్ల సమాచారం. ఇలాంటి ఫొటోలను అతను పోస్ట్ చేయటం ఇదే మొదటిసారి కాదు కానీ శ్రీదేవీ, అమితాబ్ ల కుటుంబలతో ముడి పడ్ద అమ్మాయిలు కాబట్టే ఇది మరింత వైరల్ అయ్యింది.

  గౌరవ మర్యాదలకి భంగం:

  గౌరవ మర్యాదలకి భంగం:

  గొప్ప నటీనటుల పిల్లలు ఏం చేసినా సంచలనమే. అందుకే స్టార్స్ పోస్టు చేసే చిన్న ఫోటో కూడా సంచలనంగా మారుతుంది. బాలీవుడ్‌లో గొప్పనటుడు అమితాబ్ బచ్చన్. వారి కుటుంబీకులు ఏం చేసినా అది తప్పకుండా వార్తగా మారుతుంది. ఇప్పుడదే జరిగింది. ఆయన మనవరాలు నవ్య నవేలి నంద మాత్రం ఆయన గౌరవ మర్యాదలకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది.

  సోషల్ మీడియాలో:

  సోషల్ మీడియాలో:

  సినిమాల్లోకి ప్రవేశించకపోయినా.. ఈమె పోస్ట్ చేసిన తన పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాట్ హాట్‌గా ఉన్న తన పర్సనల్ ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తాతయ్యతో సహా అందరికీ షాకిస్తోంది నవ్య. అంటూ వస్తున్న కథనాలు, అమితాబ్ నే కాదు నవ్య తల్లి అయిన శ్వేతా బచ్చన్ నందా నికూడా భాదించాయట.

  మనవరాళ్ళ కోసమే:

  మనవరాళ్ళ కోసమే:

  అదే సమయం లో అమితాబ్ బచ్చన్ నటించిన "పింక్" సినిమా ప్రమోషన్ లో భాగం గా అమితాబ్ తన మనవరాళ్ళని ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. ఇందులో తన కుమారుడైన అభిషేక్ కూతురైన ఆరాధ్య ని కూడా పేర్కొంటూ రాసిన లేఖ బాగానే ప్రచారం అయ్యింది.

  వారే నిర్ణయిస్తారు:

  వారే నిర్ణయిస్తారు:

  మీ మీ తాతలు హెచ్‌పీ నందా, హరివంశ బచ్చన్‌లు ఓ ఉన్నతమైన వారసత్వాన్ని ఇప్పటికే మీకు. అప్పగించారు. ఆ రెండు ఇంటిపేర్లే మీకు కీర్తి, గౌరవం, గుర్తింపు ఇచ్చాయి. అయినప్పటికీ మీరు అమ్మాయిలు కదా.. అందువల్ల ఈ సమాజం మీకు ఓ సరిహద్దును నిర్ణయిస్తుంది. మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. ఎలా ప్రవర్తించాలి. ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి అన్నది వారే నిర్ణయిస్తారు.

  మీ నిర్ణయాలు మీరే:

  మీ నిర్ణయాలు మీరే:

  ఈ చీకటి నీడల్లో మీరు బతకవద్దు. మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలంటే మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. 'మీ స్కర్ట్‌ ఎంత పొడవుండాలి? మీ స్నేహితులుగా ఎవరుండాలి? అనే విషయాలపై మీరే నిర్ణయం తీసుకోండి'. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని ఇతరులకు కల్పించొద్దు. మీరు కోరుకున్న వారితోనే పెళ్లి చేసుకోండి. ఇంకా ఏ ఇతర కారణంతోనూ పెళ్లికి తలూపవద్దు

  కంగారు పడొద్దు.:

  కంగారు పడొద్దు.:

  చాలా మంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. అలాగని అవన్నీ మీరు వినాలని కాదు. ఏ విషయంపైనా కంగారు పడొద్దు. మీ మీ జీవితాల్లో జరిగిన సంఘటనలన్నింటికీ మీరే కర్త, కర్మ, క్రియ అనే విషయాన్ని మర్చిపోవద్దు. నవ్యా..! నీ ఇంటి పేరు నీకు ఇచ్చే అధికారాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు. అది నిన్ను ఎప్పటికీ రక్షించలేదు. ఎందుకంటే నువ్వు అమ్మాయివి కదా..!ఆరాధ్యా..! నువ్వు ఈ విషయాలన్నీ చదివి అర్థం చేసుకునే సమయానికి నేను ఈ లోకంలో ఉండక పోవచ్చు.

  ఇట్లు.. మీతాత...:

  ఇట్లు.. మీతాత...:

  కానీ నేను ఇప్పుడు చెప్పేది మాత్రం నీకు కచ్చితంగా వర్తిస్తుంది. మీ పరిధులను మీరే నిర్ణయించుకోవడం కాస్త కష్టంగానే ఉండొచ్చు.అలాంటి ప్రపంచంలో మసలు కోవడం ఇబ్బందిగానే అనిపించొచ్చు. కానీ మీలాంటి వారివల్లే ఈ ప్రపంచం మారొచ్చని నేను నమ్ముతున్నాను. మీరు దీనినే ఆచరించండి. నేను సాధించిన దానికంటే ఇంకా ఎక్కువగానే మీరూ సాధిస్తారు. ఒక అమితాబ్‌ బచ్చన్‌గా కాకుండా మీ తాతగా ఈ ప్రపంచానికి పరిచయమవ్వడాన్ని నేను గర్వంగా భావిస్తాను.

  ఇట్లు.. మీతాత... అమితాబ్ బచ్చన్ అంటూ లేఖని రాసాడు అమితాబ్.

  శ్వేత బచ్చన్ నంద:

  శ్వేత బచ్చన్ నంద:

  తాజాగా ఆయన కుమార్తె శ్వేత బచ్చన్ నంద కూడా తన కుమార్తె కోసం ఓ బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ లెటర్ నవ్యను అడ్రస్ చేస్తూ కాక మీడియాను ఉద్దేశించి లిఖించారు. తన గారాలపట్టిని బలవంతంగా లైమ్‌లైట్‌లోకి లాగుతున్నారంటూ ప్రసారమాధ్యమాలపై అసంతృప్తి వెళ్లగక్కారు. కుమార్తె నవ్యపై ఇటీవలిగా మీడియాలో వస్తున్న వార్తలు, ఆమె ఫోటోల ప్రచురణపై శ్వేత విచారం వ్యక్తంచేశారు. తన కుమార్తె శరీరాన్ని ఉద్దేశించి 'హాట్', 'వైల్డ్' లాంటి మాటలు ఉపయోగించడంపై ఆవేదన చెందారు

  ఆమె అనుమతి తీసుకుంటున్నారా:

  ఆమె అనుమతి తీసుకుంటున్నారా:

  నవ్య టీనేజర్ అని ఆ వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారో తానూ అలాగే ఉందని దీనికి ఇంతటి ఫోకస్ అవసరమా అని శ్వేత ప్రశ్నిస్తున్నారు. "సోషల్ మీడియాలో స్నేహితులతో నవ్య షేర్ చేసుకున్న ప్రైవేట్ ఫొటోలను వెబ్‌సైట్లలో పెట్టేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు మీరు ఆమె అనుమతి తీసుకుంటున్నారా"? అంటూ సూటిగా క్వశ్చన్ చేశారు. "బీచ్‌ కు వెళ్లినప్పుడు ఎవ్వరైనా స్విమ్ సూటే వేసుకుంటారు.

  నవ్య సర్వ సాధారణ టీనేజరే:

  నవ్య సర్వ సాధారణ టీనేజరే:

  నవ్య కూడా అలాగే వేసుకుంది. మిత్రుల్లో అబ్బాయిలూ ఉంటారు. వారందరితో సరదాగా పార్టీలకు వెళ్తుంటుంది. నా కుమార్తె కూడా ఓ సర్వ సాధారణ టీనేజరే అంతకు మించి ఆమెలో అసంబద్ధ ప్రవర్తనను నేను గమనించలేదు" అని శ్వేత వ్యాఖ్యానించారు. మీడియాలో తనపై వస్తున్న వార్తలేవీ నవ్యకు తెలీదని చెప్పుకొచ్చారు. చిన్న పిల్లలను హాట్, వైల్డ్ అంటూ కామెంట్ చేయడం తగదని సూచించారు.

  English summary
  Shweta Bachchan Nanda has penned a emotional open letter to the media in DNA, where she questioned their right to publish pictures of her daughter Navya Naveli Nanda with sensational headlines.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X