»   » పెదవి విప్పిన శ్వేతబసు.. మెరుపు తీగగా న్యూలుక్ అదుర్స్..

పెదవి విప్పిన శ్వేతబసు.. మెరుపు తీగగా న్యూలుక్ అదుర్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన అందాల తార శ్వేతబసు తొలి చిత్రంతోనే హిట్‌ను సొంతం చేసుకొన్నది.
ఆ తర్వాత విజయాలను అందుకొంటూ అగ్రతారగా మారింది. అలా గ్రాఫ్ సక్సెస్ బాటలో పయనిస్తుండగా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా బాలీవుడ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె అందంతో పలువురిని ఆకట్టుకొన్నది.

అందానికి, మానసిక వికాసానికి మెరుగులు..

అందానికి, మానసిక వికాసానికి మెరుగులు..

వ్యభిచారం ఆరోపణలతో అరెస్ట్ కావడంతో శ్వేతబసు సినీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కేసును కోర్టు కొట్టేసిన తర్వాత ముంబై వెళ్లి తన తన అందానికి, మానసిక వికాసానికి మెరుగులు దిద్దుకొన్నది. ముంబైలో కెరీర్ పై దృష్టిపెట్టింది.

ప్రముఖులతో మ్యూజిక్ ఆల్బం

ప్రముఖులతో మ్యూజిక్ ఆల్బం

ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నే తన అభిరుచులకు తగినట్టుగా మ్యూజిక్ ఆల్బం రూపొందించింది. మ్యూజిక్ ఆల్బం కోసం ఏఆర్ రహ్మాన్, హరిప్రసాద్ చౌరాసియా తదితరుల్లాంటి సంగీత దిగ్గజాలను ఇంటర్వ్యూ చేసి ప్రాచీన కళలకు మళ్లీ జీవం పోసింది.

చంద్రనందిని సీరియల్‌లో ప్రధాన పాత్ర

చంద్రనందిని సీరియల్‌లో ప్రధాన పాత్ర

హిందీలో చారిత్రాత్మక సీరియల్ 'చంద్రనందిని'లో ప్రధాన పాత్రను చేజిక్కించుకొన్నది. తాజాగా వరుణ్ ధావన్, ఆలియాభట్‌తో కలిసి 'బద్రీనాథ్‌కి దుల్హానియా'లో ప్రత్యేక పాత్రలో మెరిసింది.

వరుణ్ ధావన్‌తో జతకట్టిన మెరుపుతీగ

వరుణ్ ధావన్‌తో జతకట్టిన మెరుపుతీగ

ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ముద్దుగుమ్మ శ్వేతాబసును చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో.. అందరినీ ఆకట్టుకొన్నది. ఆ ఘటన తన జీవితంలో ఓ పీడకల అని తన సన్నిహితులతో భావాలను పంచుకొన్నది శ్వేత బసు.

English summary
Shweta Basu Prasad who got mired in controversy two years ago staged a comeback with 'Chandra-Nandini'. Latest look of her stunning.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu