»   » సానుభూతి అవసరం లేదు, సెక్స్ రాకెట్ ఇష్యూపై శ్వేతా బసు

సానుభూతి అవసరం లేదు, సెక్స్ రాకెట్ ఇష్యూపై శ్వేతా బసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శ్వేతా బసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మక్దీ, ఇక్బాల్ లాంటి సినిమాల ద్వారా హిందీలో బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమాల ద్వారానే.

Also Read : శ్వేతబసు ఉన్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవటం ఖాయం...(వీడియో,ఫొటోలు)

Shweta Basu says, she needs work, not sympathy

2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యారు.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆమె హిందీ బుల్లితెర పరిశ్రమలో పలు అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చంద్ర నందిని అనే హిందీ టీవీ సీరీస్ లో నటిస్తున్నారు.

షో ప్రమోషన్లో పాల్గొన్న ఆమెకు తన గతం గురించిన ప్రశ్నలు మీడియా నుండి ఎదరయ్యాయి. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన రీతిలో స్పందించారు. గతం గురించి మాట్లాడటానికి నిరాకరించారు. మీ సానుభూతి తనకు అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు. తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే పెట్టారు.

English summary
Shweta Basu Prasad was best remembered as the child star from Makdee and Iqbal, till she got into controversy in prostitution racket in 2014. Two years later, questions regarding the controversy continue to dog her. Recently Shweta spotted promoting her upcoming show Chandragupta Maurya where she refuses to answer questions posed by scribes regarding her past. She made is pretty clear that she don't need sympathies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu