»   » సూపర్బ్ :సిద్ధార్థ్‌ కొత్త చిత్రం 'జిల్‌ జంగ్‌ జక్‌' ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

సూపర్బ్ :సిద్ధార్థ్‌ కొత్త చిత్రం 'జిల్‌ జంగ్‌ జక్‌' ఫస్ట్‌లుక్‌ (ఫొటో)

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నటుడు సిద్ధార్థ్‌ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'జిల్‌ జంగ్‌ జక్‌' ఫస్ట్‌లుక్‌ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి ధీరజ్‌ వైడి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సిద్ధార్థ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

మరో ప్రక్క ...

సిద్దార్ద హీరోగా తమిళంలో రూపొందిన జిగరతాండ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే కాస్కో సబ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు అనే టైటిల్ పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం ఓపినింగ్స్ కు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

సిద్దార్ద హీరోగా పిజ్జా దర్శకుడు రూపొందించి తమిళంలో హిట్టైన 'జిగర్‌దండా' చిత్రానికి తెలుగు టైటిల్ గా 'చిక్కడు దొరకడు' ని ఖరారు చేస్తూ ఆ మధ్యన పోస్టర్ విడుదల చేసారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడేవారే కరువు అయ్యారు. దాంతో చిత్రం బిజినెస్ జరగకపోవటంతో మూలన పెట్టేసారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని మళ్లీ దుమ్ముదులిపి, టైటిల్ మార్చి... దిల్ రాజు అని పెట్టారు. అలాగే...దమ్ముంటే కాస్కో అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేస్తున్నారు. అంటే దిల్ రాజు..దమ్ముంటే కాస్కో అని వస్తున్న చిత్రం విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాసం ఉంది.

sidhard

'బాయ్స్‌' ద్వారా తెలుగు,తమిళ ప్రేక్షకులను పలకరించిన నటుడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా వంటి చిత్రాలతో ... తెలుగువారికి నచ్చిన హీరోగా పేరు సొంతం చేసుకున్నాడు. కానీ కొంత కాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స లేవు. ఇప్పుడు తన దృష్టిని తమిళతెరపై పెట్టాడు.

English summary
Actor Siddharth's upcoming venture Jil Jung Juk's stunning first look released today,poster came out from the official handle of Siddharth's Etaki production house and his own twtter Id,The film financed by Siddharth's own production banner Etaki Entertainment .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu