»   » సిద్ధార్థ్‌ ట్వీట్‌ ఎఫెక్ట్ : స్టార్ హీరో యాడ్ ఏకంగా క్లోజైంది..అసలేం జరిగిందంటే

సిద్ధార్థ్‌ ట్వీట్‌ ఎఫెక్ట్ : స్టార్ హీరో యాడ్ ఏకంగా క్లోజైంది..అసలేం జరిగిందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో సిద్దార్దకు ఈ మధ్యకాలంలో సినిమాల్లో సక్సెస్ తగ్గింది. కానీ ఆయన సామాజిక అంశాల విషయంలో సోషల్ వర్కింగ్ ద్వారా దూకుడుపెరిగింది. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలే కాదు అటు సామాజికఅంశాలపైనా ట్విట్టర్లో తరచుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు హీరో సిద్ధార్థ్‌.

ఆ మధ్యన చెన్నై నగరం వరద బీభత్సానికి అతలాకుతలమైనప్పుడు సోషల్‌ మీడియాను వేదికగా ఉపయోగించుకుని సిద్దార్ద చేసిన సాయం సైతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా జాక్‌ అండ్‌ జోన్స్‌ వారి ప్రకటన అసభ్యంగా ఉందని ట్వీట్ చేసారు. దాంతో ఏకంగా కంపెనీ..ఆ యాడ్ నే వెనక్కి తీసుకుంది. ఆ యాడ్ లో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించటం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... జాక్‌ అండ్‌ జోన్స్‌ బట్టల కంపెనీ.. వారు తాము ఉత్పత్తి చేసే దుస్తుల పబ్లిసిటీలో భాగంగా ఓ యాడ్ తో కూడిన హోర్డింగ్ ని అంతటా ఏర్పాటు చేసారు. ఆ యాడ్ లో బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ ఓ మోడల్‌ను భుజాలపైకి ఎత్తుకుని ఉన్న ఓ ప్రకటన బోర్డును చెన్నై నగరంలో ఏర్పాటు చేసింది. దీన్ని సిద్దార్ద చూడటం తటస్దిచింది. దాన్ని ట్విటర్లో పోస్ట్‌ చేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

స్త్రీలను గౌరవించే భారతదేశంలో మహిళలను దిగజార్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి పలువురు నెటిజన్లు సైతం సపోర్ట్ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన కంపెనీ ఆయనకు బదులిస్తూ ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని.. వెంటనే సదరు ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించింది.

దీంతో సిద్ధార్థ్‌ చూపిన చొరవకు ప్రశంసలు లభిస్తున్నాయి. అదండీ విషయం. ఆయనే కాదూ మనం కూడా ఇలాంటి యాడ్స్ ఏమైనా అసభ్యంగా ఉన్నట్లు గమనిస్తే మన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా కూడా తెలియచేస్తే మంచి పనిచేసినట్లే. ఏమంటారు.

English summary
Jack & Jones’ new ad featuring Bollywood heartthrob Ranveer Singh has drawn flak from Tamil superstar Siddharth, who took to his microblogging account to criticize the ‘sexist’ ad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu