»   »  సీనియర్ నటి ఇంట్లో దొంగతనం..పోలీస్ ధర్యాప్తు

సీనియర్ నటి ఇంట్లో దొంగతనం..పోలీస్ ధర్యాప్తు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి తర్వాత అబ్బాయిగారు వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నటి జయచిత్ర. తాజాగా జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువును దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీస్ కంప్లైంట్ చేసారు.

వివరాల్లోకి వెలితే... జయచిత్ర చెన్నైలో ని నుంగంబాక్కం, మహాలింగపురంలో నివసిస్తున్నారు. ఈమె తన ఇంటి ఎదుట ఓ వినాయక ఆలయాన్ని నిర్మించారు. సన్నిధిలోని వినాయక విగ్రహానికి 25 కిలోల అలంకరణ వస్తువులను వితరణ చేశారు. పూజలు పూర్తయిన తర్వాత ఈ వెండి వస్తువులను ఆమె తన ఇంటి పూజగదిలో దాచేవారు.

కొన్ని రోజుల కిందట మహాలింగపురంలోని ఇంటికి తాళం వేసి.. నుంగంబాక్కంలోని ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 24వ తేది నుంచి వెండివస్తువులు కనిపించకుండా పోవడంతో ఆమె శుక్రవారం రాత్రి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Silver Armour Stolen from Jayachitra's House

పూర్తి వివరాల్లోకి వెళితే...

25 కిలోల వెండి వస్తువుల అపహరణ చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటిప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు.

విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలో భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించకుండా పోయాయని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A 25-kg silver armour worth `9 lakh was reported stolen from a temple at the house of yesteryear silver screen actress Jayachitra on Saturday. The Sri Jaya Vinayagar temple is part of Jayachitra's house at Mahalingapuram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu