»   » మళ్ళా ఒక సారి "బిల్లా" గా వస్తాడట: క్లాసిక్ హిట్ తో మరోసారి శింబు

మళ్ళా ఒక సారి "బిల్లా" గా వస్తాడట: క్లాసిక్ హిట్ తో మరోసారి శింబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆల్ టైం హిట్ ఫార్ములా లేకాది ఆల్ టైం సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అమితాబ్ బచ్చన్ డాన్ లాగా. హిందీలో అంతాబ్ హీరోగా వచ్చినడాన్ అదే కోవకి చెందుతుంది. డాన్ తెలుగులో యుగంధర్.,తమిళంలో బిల్లా, మ‌ల‌యాళంలో శోభ‌రాజ్ పేర్లతో రీమేక్ అయి అప్పట్లో సంచలనం సృష్టించింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన సినిమా ఇది..

ఒక్క మ‌ల‌యాళం త‌ప్ప అన్ని భాషల్లోనూ కథ ఏం మార్పులకు గురికాకుండా వచ్చింది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత మళ్లీ మూడు భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ గా వచ్చి మళ్ళీ అదే సత్తాని చూపించింది. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ పాత "డాన్ను" మోడర్నైజ్ చేస్తే.. తమిళంలో విష్ణువర్ధన్ అక్కడి నేటివిటీకి తగ్గట్లు అజిత్ తో కలిసి ట్రెండీగా సినిమాను తీర్చిదిద్దాడు.

simbu
  

ఇక తెలుగులో ప్రభాస్ హీరోగా "బిల్లా" గానే వచ్చి మరీ హిందీ,తమిళ్ అంత కాకపోయినా మంచి మార్కులేవేయించుకుంది.. ఆ తరువాత అజిత్ మరినత సాహసం చేసి ప్రీక్వెల్ గా డేవిడ్ బిల్లా అనీ, హిందీలో సీక్వెల్ అంటూ డాన్-2 అనీ తెరకెక్కించినా రెండూ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో అయితే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బిల్లా సినిమా తెరమీదకు వచ్చింది. కోలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో శింబు, బిల్లా సినిమాకు సీక్వల్ ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా హిందీ డాన్-2 కి రేమేక్ కాదు వేరే కథ ని సిద్దం చేసారట. తమిళంలో ఇదివరకూ మంచి క్రేజ్ ఉన్న హీరో శింబు ఈ మధ్య అనవసర గొడవలతో కెరీర్ పాడుచేసుకున్నాడు.

చాలా రోజులుగా కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న శింబు, తన మాజీ ప్రేయసి నయన తారతో కలిసి చేసిన "ఇదు నమ్మ ఆలు" సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. అదే జోరులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి బిల్లా సీక్వల్ అంటూ అనౌన్స్ చేశాడు.

అంతే కాదు తన సొంత బ్యానర్ లో నే భారీ బడ్జెట్ తో ఈ సీక్వెల్ స్టోరీ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు శింబు. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరెకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాడట. అయితే ఈ సినిమాకూడా హిందీ సీక్వెల్,తమిళ ప్రీక్వెల్ లాగా చతికిల బడుతుందో లేక శింబు ని పాత రేంజ్ కి తీసుకు వెళ్తుందో చూడాలి...

English summary
Filmmaker Venkat Prabhu and actor Simbu might join hands for the reboot of Tamil actioner Billa. The film was earlier twice made with superstar Rajinikanth and Ajith Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu