»   » నిర్మాతే కాదు...దర్శకురాలు కూడా ఆ హీరోయినే

నిర్మాతే కాదు...దర్శకురాలు కూడా ఆ హీరోయినే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, నిన్ను చూడాలని, డాడీ, మృగరాజు వంటి ఎన్నో చిత్రాలలలో స్టార్ హీరోల సరనస చేసి వెలుగు వెలిగిన తార సిమ్రాన్‌ ఇప్పుడు సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు. అంతేకాదు ఆమె నిర్మాతగానూ మారుతోంది. ఒక ప్రకటన ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 'సిమ్రాన్‌ అండ్‌ సన్స్‌' పేరుతో బ్యానర్‌ని ప్రారంభించామన్నారు. దీని ద్వారా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాలపై తనకున్న ఎల్లలు లేని అభిమానమే సినిమా నిర్మాణ రంగం వైపు దృష్టి సారించేలా చేసిందని సిమ్రాన్‌ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ''సినిమా రంగం పట్ల నాకున్న ఆసక్తి, ప్రేమ అందరికీ తెలిసిందే. నటిగా అందరి ఆదరాభిమానాలు పొందిన నేను నిర్మాతగానూ మారుతున్నాను. సినిమా కెరీర్‌ తర్వాత బుల్లితెరపైనా నన్ను జనం అభిమానించారు. పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించా. ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేయనున్నాం. ఒక దానికి నేనే దర్శకత్వం వహిస్తా. నటిగా ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు దర్శకురాలిగా కూడా అంతే అభిమానం చూపుతారనే నమ్మకం ఉంది''అని చెప్పారు.

Simran and sons Production company: Two films a year

పూర్తి వివరాల్లోకి వెళితే..

తన అందంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సిమ్రాన్‌... వైవాహిక జీవితం అనంతరం బుల్లితెరకు పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆమె వెండితెరపై దర్శకురాలిగా అడుగు పెట్టబోతున్నారు. నిర్మాతగానూ అవతారమెత్తారు. ఇందుకోసం సొంతంగా 'సిమ్రాన్‌ అండ్‌ సన్స్‌' పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలోనో లేక సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనో తారలు కేరక్టర్‌ ఆర్టిస్టులుగా మారడం చూస్తుంటాం. అలాకాకుండా నిర్మాతగానూ మారుతున్నవారూఉన్నారు. తాజాగా నిన్నటి తరం హీరోయిన్ సిమ్రన్‌ నిర్మాత కాబోతోంది.పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

English summary
Simran announced the launch of her production company Simran and sons in Chennai. " I also have plans for making a movie myself" Simran stated. she says the Passion she has towards cinema lead her into starting a production company of her own. Simran still has a huge fan crowd amid the south audience. she also ventured into television acting but has not flared well
Please Wait while comments are loading...