»   » ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ వివాదం: తెలుగులో ‘సింగం-3’కి బ్రేక్!

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ వివాదం: తెలుగులో ‘సింగం-3’కి బ్రేక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య, అనుష్క, శ్రుతిహాసన్‌ ప్రధాన ప్రాతలుగా తెరకెక్కిన 'ఎస్‌3(సింగం-3)' చిత్రం తమిళం, తెలుగు వెర్సన్ ఈ రోజు (ఫిబ్రవరి 9)న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి.

తమిళంలో సినిమా ఈ రోజు విడుదలవ్వగా .... తెలుగులో మాత్రం సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఏపీ, తెలంగాణల్లో చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. వాయిదాకు కారణం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చిన్న వివాదమే కారణమని తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు ఈ పరిణామాలతో ఇబ్బందులకు గురయ్యారు. థియేటర్స్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Singam 3

చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ డబ్బులు చెల్లించక పోవడంతో ఆయా రీజియన్స్ లో శాటిలైట్ సిగ్నల్స్ ప్రొడ్యూసర్ లాక్ చేసినట్లు సమాచారం. చాలా చోట్ల మల్టిప్లెక్స్ ల్లో కూడా ప్రొడ్యూసర్ నుండి కీ కోడ్ రాక పోవడంతో మార్నింగ్ షోలు పడలేదు.

తెలుగులో ఈ సినిమాను మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన డిస్ట్రిబ్యూటర్స్ నుండి రావాల్సిన అడ్వాన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని, అందుకే అడ్వాన్స్ ఇచ్చిన వారికే కీ కోడ్ చెప్పి సినిమాను ప్రదర్శన అయ్యేలా చేస్తున్నారట. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ గొడవ సద్దుమనిగే అవకాశం ఉంది.

English summary
Singam 3 telugu screening has been stopped in many parts of Andhra Pradesh and Telangana due to deadlock over distributors and producer. Apparently, most of the distributors haven't paid advances to the producer so producer decided not to screen the film in their regions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu