Don't Miss!
- News
‘వందే భారత్’లో కూడా అలాగే చేస్తున్నారా?
- Sports
హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే టీమిండియా కొంపముంచింది: వసీం జాఫర్
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్టెల్కు పెరిగిన డిమాండ్.. !
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
స్కూల్ విద్యార్థి అలా నాపై దాడి చేశారని నెటిజన్ ఫిర్యాదు.. సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్
స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద రోజుకో ట్వీట్ తో తనదైన శైలిలో సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఎదో ఒక విధంగా స్పందిస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో పలువురిపై ఆమె మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో సింగర్స్ కి కూడా అలాంటి బాధలు తప్పడం లేదని అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల చిన్మయి చేసిన ఒక పోస్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్మయి వైరల్ ట్వీట్..
ఇటీవల 7వ తరగతి విద్యార్థి చేసిన తప్పుపై కూడా ఆమె స్పందించారు. ప్రతిరోజు ఇలా ఎన్నో జరుగుతున్నాయి అనే విధంగా ఒక మహిళ చెప్పిన ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్త్రీల పట్ల జరుగుతున్న లైంగిక దాడుల గురించి అలాగే అవమానాలు గురించి చిన్మయి తనదైన శైలిలో స్పందిస్తోంది.

నా కూతురిపై..
ఒక మహిళ తన కూతురికి జరిగిన చేదు అనుభవం గురించి చిన్మయికి ఈ విధంగా వివరణ ఇచ్చింది... మా అమ్మాయికి ఎనిమిదేళ్లు. రెండవ తరగతి చదువుతోంది. మాకు తెలిసిన పక్కింటి కుర్రాడు 7వ తరగతి చదువుతున్నాడు. అతను నిన్న నా కూతురి ప్రైవేట్ పార్ట్ పై తీవ్రంగా గాయపరిచాడు. తను ఇంటికి రాగానే చాలా మంటగా ఉందని బాధపడింది. నేను వెంటనే తనకు పెరుగన్నం తినిపించాను.
|
మళ్ళీ గాయపరిచాడు..
ఈ రోజు తను బయట ఆడుకుంటూ ఉండగా మళ్ళీ అతను నా కుతురిని పిలిచాడు. అందుకు నా కూతురు భయపడి ఒక చోట దాక్కొని ఉంది. మళ్ళీ అతను అదే తరహాలో నా కూతురిని గాయపరిచాడు. దానికి నా కూతురు భయపడి అతన్ని తోసేసి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ఆ ఘటనను నేను చూశాను. వెంటనే అతన్ని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అయితే అతను మాత్రం తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పొద్దని నన్ను అడుక్కున్నాడు.
Recommended Video

సలహా ఇవ్వండి..
మళ్ళీ తన కూతురి జోలికి రావద్దని నేను గట్టిగా చెప్పాను. కానీ నా కూతురు అతని విషయంలో చాలా భయపడుతోంది. ఎప్పటికైనా అతను మళ్ళీ వస్తాడని భయం వేస్తోందని నాతో చెప్పింది. ఈ విషయంలో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఏమైనా సలహా ఇవ్వండి అంటూ.. ఒక మహిళ తనకు ఈ విషయాన్ని చెప్పిందని చిన్మయి ట్వీట్ లో తెలిపింది. ఇలాంటివి తనకు ప్రతిరోజు వస్తున్నాయని చిన్మయి పేర్కొంది.