»   » సింగర్ చిన్మయికారు ధ్వంసం.. అమెరికా లో దాడి ఘటన

సింగర్ చిన్మయికారు ధ్వంసం.. అమెరికా లో దాడి ఘటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్.. చిన్మయి శ్రీపాద కారుపై దుండగులు దాడి చేశారు. సుచీలీక్స్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే సింగర్ చిన్మయి శ్రీపాదకు మరో షాక్ తగిలింది. చిన్మయి శ్రీపాద మ్యూజిక్‌ టూర్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది.

కారును ధ్వంసం చేసి

కారును ధ్వంసం చేసి

అక్కడ కొందరు దుండగులు చిన్మయి కారును ధ్వంసం చేసి, అందులోని వస్తువులను దొంగలించారట. అయితే పార్క్ చేసి ఉన్న కారు మీదనే ఈ దాడి జరిగింది. చిన్మయి పూర్తి సేఫ్ గా ఉంది. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. కారును పార్కింగ్‌ చేసి ఉండగా చోరీ జరిగినట్లు ట్వీట్ చేసింది.

ఇటువంటి సంఘటనలు అక్కడ సాధారణమే

ఇటువంటి సంఘటనలు అక్కడ సాధారణమే

కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందట.కారును ధ్వంసం చేస్తుండగా సమీపంలో ఉన్న వారు కేకలు వేసి అప్రమత్తం చేశారని, ఈ సంఘటన జరిగిన ఐదు నిమిషాల తర్వాత కారులో ఉన్న తన వస్తువులు చోరీకి గురయ్యాయనే విషయాన్ని గుర్తించానని, ఇటువంటి సంఘటనలు ఇక్కడ సాధారణమేనని పోలీసులు చెప్పారని చిన్మయి పేర్కొంది.

సీసీ కెమెరాల్లో

సీసీ కెమెరాల్లో

తన వస్తువులు తిరిగి దొరకాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది చిన్మయి. అయితే ఈ ఘటన జరుగుతున్న టైంలో ఓ యువతి అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని.. మంచివాళ్లూ ఇంకా ఈ భూమ్మీద ఉన్నారనటానికి ఆమె నిదర్శనం అంటూ ట్వీట్లో తెలిపింది సింగర్ చిన్మయి.

సింగర్ సుచిత్ర

సింగర్ సుచిత్ర

ఇప్పటికే మరో సింగర్ సుచిత్ర కొన్నాళ్ళ క్రితం ఇచ్చిన లీకుల్లో భాగంగా చిన్మయి కి పెళ్ళికి ముందే నాలుగు సార్లు అబార్షన్ చేయించుకుందంటూ, నగ్న వీడియోలను పోస్టు చేస్తూ ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మానసిక భాదనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బిజీ అవుతున్న చిన్మయి ని ఈ సంఘటన కొంచం డిస్ట్రబ్ గానే ఉన్నట్టుంది.

English summary
Singar Chinmayi belongings were stolen from a parked car, while she was standing right by the vehicle and it took her five minutes to come to terms with what had happened. Though the police told her told that such incidents were common in that area
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu