»   » ఆరేళ్లు టార్చర్ అనుభవించా: విడాకులపై సింగర్ కౌసల్య

ఆరేళ్లు టార్చర్ అనుభవించా: విడాకులపై సింగర్ కౌసల్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సాధారణ మహిళలు మాత్రమే కాదు... సెలబ్రిటీలు సైతం గృహ హింస, వేధింపులకు గురవుతున్న సంఘటనలు అనేకం. ఈ పరిణామాలు చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. ఇలాంటివి ఎదుర్కొన్న సెలబ్రిటీల్లో ప్రముఖ తెలుగు సింగర్ కౌసల్య ఒకరు.

  కౌసల్య తన చిన్న నాటి స్నేహితుడిని ఇష్టపడి పెళ్లాడింది. పెళ్లయిన తర్వాత అతడి నుండి వేధింపులు ఎదురవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి తీరు మారలేదు. అలాంటి వ్యక్తితో జీవించడం కంటే విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుని తెగదెంపులు చేసుకున్నారు.

  ప్రస్తుతం కౌసల్య తన కుమారుడితో ఉంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల అంశంపై స్పందించారు.

  ఆరేళ్లు టార్చర్

  ఆరేళ్లు టార్చర్

  నేను ఏదో క్షణికావేశంలో విడాకులు తీసుకోలేదు. వైవాహిక జీవితంలో దాదాపు ఆరేళ్లు టార్చర్ అనుభవించాను. అంతకు మించి భరించడం నా వల్ల కాలేదు. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కౌసల్య తెలిపారు.

  Singer Suchitra Leaks Kissing Pictures of Rana, Trisha
  ఇలాంటివి ఊహించలేదు

  ఇలాంటివి ఊహించలేదు

  పెళ్లైన పదహారు రోజులకే భర్త కొట్టాడు. అందరి ముందు తీవ్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి తిట్టేవాడు. అతడి ప్రవర్తన చూసి అతడి పేరెంట్స్ కూడా షాకయ్యేవారు. వారి ఫ్యామిలీలో ఎవరికీ లేని తిట్టడం, కొట్టడం లాంటి అలవాట్లు ఇతడికి ఎలా వచ్చాయని బాధపడే వారు అని కౌసల్య తెలిపారు.

  స్వేచ్ఛ ఉండేది కాదు

  స్వేచ్ఛ ఉండేది కాదు

  అతడితో కలిసి ఉన్నంత సేపు స్వేచ్ఛ ఉండేది కాదు. నా ఇష్టాలతో సంబంధం లేకుండా అతడి ప్రవర్తన ఉండేది. నేను చీరకట్టుకునే విషయంలో, చివరకు బొట్టు పెట్టుకునే విషయంలో కూడా అలా, ఇలా అని చెప్పేవాడు. అయినా సరే సర్దుకుపోయాను. ఆ వేధింపుల మధ్య, హింస మధ్య ఉండటం నా వల్ల కాలేదు, అందుకే విడిపోవాల్సి వచ్చింది అని కౌసల్య తెలిపారు.

  కొడుకు విషయంలో కూడా

  కొడుకు విషయంలో కూడా

  నా విషయంలో ఎన్ని చేసినా భరించాను. కానీ కొడుకు విషయంలో కూడా బాధ్యతగా ఉండేవాడు కాదు. అలాంటి వ్యక్తితో ఉండటం కంటే విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు కౌసల్య తెలిపారు.

  మరో మహిళతో సంబంధం

  మరో మహిళతో సంబంధం

  నాతో ఉన్నప్పటి నుండే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. వారికి సంబంధించిన వార్తలు కూడా చాలా విన్నాను. ఓ సారి నా కొడుకు వారిని స్వయంగా చూశాడు. విడిపోవడానికి ఇంతకు మించిన కారణం అవసరం లేదని కౌసల్య తెలిపారు.

  English summary
  "I was being tortured for over six years after which I wanted to part ways. Verbal abuse shocked my parents and I never brought my professional life to the home. I was asked to stay away from my choices and had no freedom. After finding it tough to stay with my husband, I decided to separate". Singer Kousalya said about her divorce.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more