twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హార్ట్ ఏటాక్ వస్తుంది జాగ్రత్త.. సింగర్ జానకి ఇక లేరు అనే వార్తలపై ఎస్పీ బాలు ఆవేదన

    |

    నైటింగేల్ ఆఫ్ సౌత్‌గా పిలుచుకునే జానకి అమ్మ అంటే అందరికి ఎనలేని గౌరవం. దిగ్గజ గాయనిగా ఎంతో మంది సంగీత ప్రియులను ఆకర్షించిన ఆమె ఆరోగ్యంపై ఇటీవల కొన్ని వార్తలు అందరిని షాక్ కి గురి చేశాయి. ఆమె ఇక లేరు అంటూ తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై సీనియర్ గాయకులు ఎస్పీ. బాల సుబ్రహ్మణ్యం కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    S. P. Balasubrahmanyam About Singer S. Janaki Health Condition

    భాష బేధం లేకుండా..

    భాష బేధం లేకుండా..

    భాష బేధం లేకుండా అన్ని వర్గాల జనాల మనసులను గెలుచుకున్న జానకి గారు కనిపిస్తే.. ఎవరైనా సరే.. జానకి అమ్మ అని పిలుస్తుంటారు. అంతగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఆమెపై తప్పుడు వార్తలు రావడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. 82 సంవత్సరాల వయసు ఉన్న జానకి గారు ఇటీవల కొంత అస్వస్థతకు గురయ్యారు.

    SPB ఆవేదన..

    SPB ఆవేదన..

    కుటుంబ సభ్యులు సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ చేయగా ఆమె ఆరోగ్యంపై తట్టుకోలేని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సింగర్ బాల సుబ్రహ్మణ్యం గారు వెంటనే స్పందించారు. తప్పుడు వార్తలపై ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆవేదనకు గురయ్యారు.

    హార్ట్ ఎటాక్ రావచ్చు..

    హార్ట్ ఎటాక్ రావచ్చు..

    నాకు ఉదయం 20కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందుకు కారణం జానకి అమ్మ ఇక లేరు అంటూ సోషల్ మీడియాలో కొందరు వార్తలు పోస్ట్ చేయడమే. వెంటనే ఆమె ఆరోగ్యంపై ఆరా తీయగా జానకి అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని తెలిసింది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేయకండి. జానకి అమ్మను చాలా మంది ఎంతగానో అభిమానిస్తారు. వారికి సడన్ గా గుండెపోటు కూడా రావచ్చు... జాగ్రత్త అంటూ.. సోషల్ మీడియాను మంచికోసం ఉపయోగించండి అంటూ బాలు వివరణ ఇచ్చారు.

    సింగర్ మనో కూడా..

    సింగర్ మనో కూడా..

    అలాగే సింగర్ మనో కూడా జానకి గారి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడాను. ఆమె మైసూర్ లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా చాలా బావుంది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ట్వీట్ చేశారు. సింగర్ బాల సుబ్రహ్మణ్యంతో పాటు మనోతో కూడా జానకి గారు అప్పట్లో అత్యదిక పాటలు పాడిన విషయం తెలిసిందే.

    45వేలకు పైగా పాటలు..

    45వేలకు పైగా పాటలు..

    82 సంవత్సరాల వయసు కలిగిన జానకి గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగారు. గాయనిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జానకి అమ్మ సుధీర్ఘ కెరీర్‌లో 45 వేలకు పైగా పాటలు పాడారు. ఇక ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆమె అత్యదిక పాటలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు 17 భాషల్లో తన గానాన్ని వినిపించారు.

    English summary
    Janaki Amma, also known as the Nightingale of the South, is an unparalleled honor. Recent news about her health has shocked everyone as she has attracted a lot of music lovers as an iconic singer. However senior singer Singer sp balasubrahmanyam about janaki health situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X