నిజమా? మహేష్ బాబు సినిమాలో హాట్ సింగర్ సునీత?
హైదరాబాద్: ప్లేబ్యాక్ సింగర్‌గా ఇంతకాలం తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న సింగర్ సునీతకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చినా... ఒప్పుకోకుండా సింగర్ గానే కొనసాగుతూ వస్తున్నారు సునీత.
సునీతతో నటింపజేస్తే సినిమాకు ప్లస్సవుతుందని భావించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ మధ్య తన సినిమా 'అనామిక' కోసం ఆమెను ఒప్పించారు. 'అనామిక' చిత్రం ప్రమోషనల్ సాంగులో ఆమెతో నటింపజేసారు. తాజాగా ఆమెను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన సినిమాలో నటింపచేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తను దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో సునీతతో ఓ ముఖ్యమైన పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సునీత కూడా ఓకే చెప్పిటన్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సినిమాలో బ్రహ్మోత్సవం సినిమాలో... రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇందులో మహేష్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











