»   » సింగర్ సునీత డబ్‌స్మాష్ వీడియో హల్ చల్...

సింగర్ సునీత డబ్‌స్మాష్ వీడియో హల్ చల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెల్ఫీలు, డబ్ స్మాష్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్. సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటివి చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సింగర్ సునీత కూడా జాయిన్ అయ్యారు. తన అందం, సింగింగ్ టాలెంటుతో ఇప్పటికే జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత.... డబ్ స్మాష్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 Singer Sunitha's dubsmash video

‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాలో సీనియర్ కమెడియన్ కోవై సరళను ఇమిటేట్ చేస్తూ క్రియేట్ చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె ఇప్పటికే పాపులర్ కావడంతో ఈ వీడియో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

అద్భుతమైన గానామృతంతో పాటు... బ్యూటిఫుల్ లుక్స్ ఆమె సొంతం. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్లకు అభిమానులు ఉంటారు..కానీ వారిపై అభిమానం తాత్కాలికమే. సింగర్ సునీతకు మాత్రం పర్మినెంట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

ఆమెతో సినిమాల్లో నటింపజేయాలని గతంలో చాలా మంది దర్శక నిర్మాతలు ట్రై చేసారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ మధ్య శేఖర్ కమ్ముల ‘అనామిక' చిత్రం ప్రచార గీతంలో మాత్రం అలా మెరిసి ఇలా మాయమైంది. ఆమెతో ఏదైనా పాత్ర చేయించడానికి టాప్ డైరెక్టర్స్ తమ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.

English summary
Singer Sunitha who is more famous for her beautiful looks than her singing and dubbing, has now come up with a dubsmash.
Please Wait while comments are loading...