»   » శాతకర్ణి సినిమాతో.... సింగర్ సునీత 750 నాటౌట్‌!

శాతకర్ణి సినిమాతో.... సింగర్ సునీత 750 నాటౌట్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..' - 'గులాబీ' చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభి'స్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా.

పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్‌ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో కథానాయిక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్‌ చెప్పారు. తెలుగుజాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా.

సునీత మాట్లాడుతూ

సునీత మాట్లాడుతూ

ఈ సందర్భంగా సునీత మాట్లాలాడుతూ - ‘‘బాలకృష్ణగారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్‌ చేసి డబ్బింగ్‌ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్‌ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రియ అద్భుతంగా నటించడంతో నేనూ బాగా డబ్బింగ్‌ చెప్పగలిగా అన్నారు.

వారి ప్రోత్సాహం ఉంది

వారి ప్రోత్సాహం ఉంది

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తిచేసుకోవడం వెనుక దర్శక, నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. 750 చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, ప్రతి టెక్నీషియన్‌... నా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించినవారే అన్నారు సునీత

ఇంకా ఆదరిస్తారని ఆశిస్తూ

ఇంకా ఆదరిస్తారని ఆశిస్తూ

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలన చిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా అని సునీత అన్నారు.

ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత

ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత

ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Singer Sunitha worked as dubbing artist completed 750 movies. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu