»   » పార్టీలో మహిళ దుస్తులు లాగబోయాడు: బాలీవుడ్ సింగర్ అరెస్ట్

పార్టీలో మహిళ దుస్తులు లాగబోయాడు: బాలీవుడ్ సింగర్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహిళపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ గాయకుడు యశ్వదాలీని ముంబై పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన గాయకుడు వదాలీ, అక్కడికి వచ్చిన ఓ 39 ఏళ్ల మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతిథుల ముందు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ, దుస్తులు పట్టుకుని లాగి వేధించాడు.

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 354, 504 కింద కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు వదాలీని అదుపులోకి తీసుకున్నారు. వదాలీని శుక్రవారం దిండోషి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Singer Yash Wadali booked for Molesting a Woman

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వదాలీ, అక్కడికి వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా తిడుతూ, కాలర్ పట్టుకుని లాగుతూ వేధించాడు. ఆ అమ్మాయి ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు, ఐపీసీ సెక్షన్లు 354, 504 కింద కేసు నమోదు చేసి వదాలీని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నేడు దిండోషి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టనున్నామని అన్నారు. కాగా, సదరు యువతి ఎవరో తనకు తెలియదని వదాలీ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

English summary
A case of molestation is registered against Singer Yash Wadali on Thursday evening by a 39-year-old woman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu