For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దాసరి చేతికి ‘డమరుకం’

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా.వెంకట్ నిర్మించిన చిత్రం 'డమరుకం'. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా అక్టోబర్ 12న విడుదలకు సిద్ధమైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం సీడెడ్ రైట్స్ ప్రముఖ దర్శకుడు దాసరికి సంబంధించిన 'సిరి మీడియా' దక్కించుకుంది. సిరి మీడియా ఇటీవల జులాయి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని మంచి లాభాలు గడించిన విషయం తెలిసిందే. దాసరి తీరు చూస్తుంటే దర్శకుడిగా తన కెరీర్ ముగియడంతో....డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

  డమరుకం చిత్రానికి సంబంధించి నిర్మాత వెంకట్, నాగార్జున మధ్య ఏర్పడ్డ కొన్ని గొడవలను దాసరి సమక్షంలో సెటిల్ చేసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. నాగ చైతన్య దడ చిత్రంతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నష్టాల పాలైన విషయం బహిరంగ రహస్యమే.

  'డమరుకం' చిత్రంలోనూ అనుష్క గ్లామర్ ప్రదర్శనకు పెద్దపీట వేసినట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన డమరుకం స్టిల్స్‌తో నాగార్జున అనుష్క బొడ్డుపైనే గురిపెట్టి చూడటం....గ్లామర్ విందు కోరుకునే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాకు కోరుకున్న మసాలా సాంగులు, సీన్లు ఉంటాయని ఆశిస్తున్నారు.

  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేసారు. నాగార్జున కెరీర్‌లోనే హై బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మించామని, దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు.

  ప్రకాష్‌ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి, సమీర్, శ్రవణ్, రాజాశ్రీ్ధర్, ప్రభు, కమల్, రజిత, ప్రగతి, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ, విజయరంగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చోటాకె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: జొన్నవిత్తుల, చంద్రబోస్, భాస్కరభట్ల, సాహితి, రామజోగయ్యశాస్ర్తీ, కరుణాకర్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

  English summary
  Popular distribution organization Siri Media has bagged the theatrical rights of Nagarjuna's upcoming movie Damarukam for ceded. Siri Media is owned by Dr Dasari Narayana Rao and they earlier distributed movies like Jai Chiranjeeva, Chirutha, Desamuduru, Panja and other movies for few ares in AP. Our sources claim that the distribution company have paid a whopping amount to bag the rights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X