twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాటల ప్రోగ్రాంలో అతి చేస్తున్నారని అనేవారు.. ఎస్పీబీని తలుచుకుంటూ గుండెలు బాదుకున్న సిరివెన్నెల

    |

    గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారన్న వార్తతో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. ఆగస్ట్ 5న కరోనా సోకడంతో ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన బాలు కరోనాను జయించారు. కానీ ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నేటి (సెప్టెంబర్ 25) మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోరాడి అలిసి స్వర్గానికి పయనమయ్యారు. బాలుతో విడదీయని అనుబంధం ఉన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి రోధన మాటల్లో వర్ణించలేం. బాలుని తలుచుకుని గుండెలు బాదుకున్నారు.

    చాలా మంది గాయకులు వస్తారు వెళ్తారు..

    చాలా మంది గాయకులు వస్తారు వెళ్తారు..

    మా అన్నయ్య వెళ్లిపోయారు.. నాకు మాటలు రావడం లేదు.. గాలి అంటే బాలు గారి ఊపిరి.. పూడ్చలేనిది.. తీరని లోటు.. ఇలాంటివన్నీ అంటారు.. కానీ నాలో వేరే ఉక్రోషం వేరుంది..మన గుండెల్లో ఉన్న బాలు వేరు.. ఆయనకు ఇస్తున్న గౌరవం వేరు.. చాలా మంది గాయకులు వస్తారు వెళ్తారు.. కానీ కొందరు వస్తారు.. వెళ్లరు. వారు వెళ్లారని అనుకుంటున్న రోజునే కాలం వాళ్ల పేరుతో కొత్తగా పుడుతుంది. ఈ రోజు ఒంటి గంటకి తెలుగు వారిళ్లల్లో ఆయన పేరుతో పుట్టిందిని సిరివెన్నెల తెలిపారు.

    తెలుగు పాటలకు బాలు ప్రతినిధి..

    తెలుగు పాటలకు బాలు ప్రతినిధి..

    అందరూ మాట్లాడుతున్నారు గానీ గొంతులు మూగబోయాయ్. సినిమా పాటలకు సమాజంలో పెద్ద ఆరాధ్య భావనేది లేదు.. అలాంటి సినిమా పాటలకు అద్భుతమైన స్థాయి కలిపించిన గాయకుల్లో బాలు గారు ఒకరు.. అంతేకాకుండా తెలుగు పాటలకు బాలు ప్రతినిధి. ఏ గాయకుడైనా కొద్ది కాలం తరువాత కాలం చెల్లిపోతుంది. వెళ్లాల్సింది. అయితే బాలు గారికి పాట మీదున్న అక్కర ఎవ్వరికీ ఉండదు. ప్రతీ ఇంట్లో ఓ ముఖ్య సభ్యుడిగా మారిపోయారు. ఆయన మాట, పాట వినని వారెవ్వరూ ఉండరు. గాయకుడిగా మాత్రమే కాదు.. పాట పట్ల ఉన్న అక్కర, గౌరవం, భక్తి, గొంతు, ఆహార్యం, మనస్తత్వం, సాంస్కృతికమైన సంస్కరం ఇన్నీ నేర్పిన గురువు అంటూ సీతారామ శాస్త్రి పేర్కొన్నారు.

    సాంస్కృతిక ఆచార్యుడు..

    సాంస్కృతిక ఆచార్యుడు..

    పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి ప్రోగ్రాంలతో ప్రతీ ఇంట్లో సభ్యుడిగా మారారు. ఎప్పుడైనా అవి వింటే బాలు గారు గుర్తుకు రారా? సినిమా పాటల్లో ఉండే సాహిత్యానికి ఓ స్థాయికి పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవ్వరైనా ఉన్నారా? అతి చేస్తున్నారు. ఎక్కువ చేస్తున్నారు.. అని అన్నారు.. కానీ పాటలోని మాట గొప్పదనం చెప్పే వ్యక్తి, ఆ విశ్లేషణ, ఆ చాదస్త్యం, ఆ పెద్ద దిక్కు లేదు.. పాటను ఎలా పాడాలి ఎలా ఉచ్చరించాలని చెప్పే సాంస్కృతిక ఆచార్యుడు లేడని నా బాధ.. ఆయన ఇంకో పాతికేళ్లు ఉండాల్సింది కదా అని సీతారామ శాస్త్రి ఎమోషనల్ అయ్యారు.

    ప్రస్తుతం మన ఆత్మ ఘోషిస్తోంది..

    ప్రస్తుతం మన ఆత్మ ఘోషిస్తోంది..

    పాటలోని మాట.. మక్కువ.. ఉండాల్సిన విధానం.. ఆవేదన.. అక్షరాలను ఎలా ఉచ్చరించాలని పడే తపన.. ఇంకా ఉండాల్సింది.. ఇంకో పాతికేళ్లు ఉండాల్సింది.. భారతదేశంలో సినిమా ఉన్నంత కాలం బాలు గారు ఉంటారు.. ఆయన ఆత్మ శాంతించాలని కాదు.. మన ఆత్మ శాంతించాలి.. ప్రస్తుతం మన ఆత్మ ఘోషిస్తోంది.. గంధర్వుడు అంటారు కదా.. గంధర్వులకు పాటలు చెప్పడానికి వెళ్లాడు.. పాటల ప్రోగ్రాంలో అతి చేస్తున్నారని ట్రోలింగ్ చేసిన వారంతా మళ్లీ ఆ పాఠాలు విందాం... ఎందుకంటే అలా చెప్పే ఆ మాష్టరు లేరు.. అంటూ సీతారామశాస్త్రి కన్నీరు మున్నీరయ్యారు.

    Recommended Video

    Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
    నా పెద్ద దిక్కు..

    నా పెద్ద దిక్కు..

    మొదటగా సిరివెన్నెల సినిమా కోసం గంగావతరణం పాడినప్పుడు.. బాలు వచ్చి కాళ్లు మొక్కాడు. మీరు వందల పాటలు రాయాలి.. అవి నేనే పాడాలి అని ఆ రోజు అన్నారు. ఆ మాటలు బాలసుబ్రహ్మణ్యం గారు కాదు సాక్ష్యాత్తు ఆ బాలసుబ్రహ్మణ్యం స్వామి చెప్పాడేమో అని అనుకున్నాను అలాగే జరిగింది. ఎన్నో పాటలు రాశాను ఆయన పాడారు.. నా పెద్ద దిక్కు.. నా దన్ను.. ఆయనే. ఇక నా పాటలు ఎవరు పాడుతారు.,. ఆ పాటలోని తప్పులు ఇంకెవ్వరు చెబుతారు.. ఆ పాటలో సాహిత్యాన్ని ఎవరు చెబుతారు.. అంటూ సిరివెన్నెల ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Legendary singer SP Balasubrahmanyam (SPB) dies at the age of 74 who got infected due to coronavirus on August 5, 2020. Apart from this On August 5th SP Charan shared a video about sp balasubrahmanyam health condition. He died in Chennai's MGM Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X