twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sirivennela అక్షర యోధుడికి అంతిమ నివాళి.. భోరుమని ఏడ్చిన తనికెళ్ల.. ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

    |

    అక్షర యోధుడు, మహా రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల విషాద వదనాల మధ్య ముగిసాయి. బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల మరణవార్త బయటకు రాగానే మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ తదితరులు కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులను వారు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.

    కిమ్స్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంలో జాప్యం కారణంగా గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సిరివెన్నెల భౌతికకాయాన్ని తన నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజలు, ప్రముఖుల చివరి చూపు కోసం ఉంచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధీవదేహానికి భారీ సంఖ్యలో శ్రద్దాంజలి ఘటించారు. సిరివెన్నెలకు నివాళులర్పించిన వారిలో వెంకటేష్, రానా దగ్గుబాటి, అ్లలు అరవింద్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేని, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జీవితా రాజశేఖర్, నిర్మాతలు అశ్వినీదత్, గాయని సునీత తదితరులు ఉన్నారు.

    Sirivennela Seetha Rama Sastry funerals completed at Mahaprasthanam

    మహా రచయిత అంత్యక్రియల్లో పలువురు కన్నీరు పెట్టుకొన్నారు. రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీరుమున్నీరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

    గురువారం మధ్యాహ్నం సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర ఫిలిం చాంబర్ నుంచి 1 గంటకు ప్రారంభమై జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు సాగింది. ఆయన అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయ పద్దతుల్లో పూజలు నిర్వహించి సిరివెన్నెలకు చితికి తన కుమారులు నిప్పంటించారు. దాంతో తెలుగు సినీ ప్రపంచంలో అక్షరయోధుడి జీవన యాత్ర ముగిసింది.

    సిరివెన్నెల ఆకస్మిక మరణానికి కారణాలను కిమ్స్ హాస్పిటల్ ఎండీ భాస్కరరావు వెల్లడిస్తూ.. ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా సగం ఊపిరితిత్తులను తీసివేశారు. తర్వాత బైపాస్ పరీక్ష కూడా జరిగింది. ఇటీవల మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో అందులో సగం తీసేశారు. ఆ సర్జరీ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు రోజులు బాగున్నారు అని చెప్పారు. అయితే ఊహించని విధంగా సిరివెన్నెలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.

    కిమ్స్‌లో చికిత్స అందిస్తున్న సమయంలో బాగా స్పందించి కోలుకొన్నట్టు కనిపించారు. 45 శాతం ఊపిరితిత్తులను తీసివేశాం కాబట్టి.. మిగితా 55 శాతం భాగానికి ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆక్సినైజన్ కోసం ఎక్మో మిషన్ మీద పెట్టాం. గత ఐదు రోజులు నుంచి ఎక్మో మిషిన్‌పై ఉంచి చికిత్స అందించాం అని భాస్కరరావు తెలిపారు.

    కానీ మంగళవారం మధ్యాహ్నం తర్వాత సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధింత సమస్యలతో ఆయన మధ్యాహ్నం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఓ ప్రకటనలో అధికారికంగా తెలిపారు.

    English summary
    Sirivennela Seetha Rama Sastry funerals completed at Mahaprasthanam: Lyricist Sirivennela Seetha Rama Sastry no more. He Dies At The Age Of 66 Due To Pneumonia. As per Kims report, Noted Tollywood lyricist Sri Sirivennela Seetharama Sastry garu passed away this afternoon at 4.07 PM. He died of Lung Cancer related Complications.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X