»   » లోక్‌సత్తా పార్టీలో చేరిన సినీ గేయ రచయిత సిరివెన్నెల

లోక్‌సత్తా పార్టీలో చేరిన సినీ గేయ రచయిత సిరివెన్నెల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన లోక్ సత్తా పార్టీలో చేరారు. ఇప్పటికే లోక్ సత్తా పార్టీకి ప్రముఖ దర్శకుడు రాజమౌళి, శేఖర్ కమ్ముల తదితరులు లోక్ సత్తా పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీలకు సినిమా గ్లామర్ ఎంతో అవసరం అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ పార్టీలన్నీ వీలైనంత మంది సినిమా తారలను తమ పార్టీలోకి లాగారు. ఇపుడు లోక్ సత్తా పార్టీ కూడా సినిమా తారలను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తమ పార్టీలోకి ఆహ్వానించారు. జె.పి మాట్లాడుతూ.... ''నేటి సమాజంలో చాలామంది రాజకీయాన్ని వ్యాపారంగా, అధికారమార్గంగా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజకీయాన్ని పవిత్రమైన పనిగా, సమాజాన్ని మార్చే సాధనంగా, కోట్లాదిమంది బతుకుల్ని మార్చే అవకాశంగా భావించేవారు అవసరం. సమాజం బాగుండాలని తపనపడే మంచి మనసున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్‌. ఆయనకు లక్షలమంది అభిమానులున్నారు. అలాంటివ్యక్తి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి, నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఆయన్ను మనసారా ఆహ్వానిస్తున్నాం. లోక్‌సత్తాను వేదికగా చేసుకోండి'' అంటూ పవన్‌కళ్యాణ్‌ను జేపీ ఆహ్వానించారు.

English summary
Renowned lyricist Sirivennela Sitaramasastri is lending support to Lok Satta Party headed by Dr.Jayaprakash Narayana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu