»   » వావ్..! రమ్యకృష్ణ ఇప్పటికీ అదే గ్లామర్: JFW కవర్ పేజ్ నుంచి కళ్ళు తిప్పలేరు

వావ్..! రమ్యకృష్ణ ఇప్పటికీ అదే గ్లామర్: JFW కవర్ పేజ్ నుంచి కళ్ళు తిప్పలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రమ్యకృష్ణ ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, అప్పట్లో రమ్యకృష్ణని కేవలం గ్లామర్ గానే కాదు ఆహ్వానం లాంటి సినిమాల్లో కూడా రమ్య అందానికి దాసోహం అన్నారు. బాహుబాలిలో శివగామి పాత్రతో యవత్ భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోని లేటు వయస్సులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్యకృష్ణ.

ఆ ఒక్క సినిమా చాలు రమ్యకృష్ణకి ఇంకా అన్ని ఇండస్ట్రీలలో తిరుగులేకుండా చెయ్యడానికి. దక్షిణాదిన క్యారక్టర్ అర్టిస్టుల్లో అత్యంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా కూడా రమ్యకృష్ణ ఇప్పుడు నిలిచింది అంటే దీనంటటికి కారణం ఒక్క బాహుబలి సినిమానే అని చెప్పుకోవచ్చు.. హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమయంలో 'నరసింహ' వంటి సినిమాలో రజనీకాంత్ లాంటి హీరోకి దీటైనా పాత్రలో నటించి అప్పట్లోనే అందరి నుండి మంచి ప్రశంసులు అందుకుంది రమ్య.

Sivagami Ramya Krishna poses for JFW

కేవలం నటన విషయంలోనే కాదు.. గ్లామర్ విషయంలో కూడా రమ్య‌కృష్ణ‌ వన్నె తగ్గలేదు.ఇక లేటెస్ట్ గా ఆమె జే ఎఫ్ డబ్ల్యూ మేగజైన్ ముఖచిత్రంపై మెరిసింది. ఈ మేగజైన్ ముఖచిత్రం పై ఆమె లుక్ ను .. ఇచ్చిన స్టిల్ చూసిన వాళ్లంతా 'వావ్' అంటున్నారు. 46 సంవత్సరాల వయసులోను ఆమె ఇంత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటం రియల్లీ గ్రేట్ అంటున్నారు.

చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ వంటి సీనియర్ కథానాయకుల సరసన కూడా మళ్లీ కథానాయికగా అలరించేంత గ్లామర్ ఆమె సొంతమని చెప్పుకుంటున్నారు. అలా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. తల్లి పాత్రలు చేస్తున్నా, నయా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా కనిపిస్తోంది రమ్య. ఇటీవలే నాగార్జున సరసన ఒక హీరోయిన్‌గా నటించి.. ఆ సినిమాలోని అరడజను మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్య.. సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది ఈ లుక్‌లో.

English summary
On the latest issue of JFW magazine, Ramya poses quite elegantly exuding both her royal charm and also that glamour tinge.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu