twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prince Twitter Review: శివకార్తికేయన్‌ హిట్ కొట్టాడా? అనుదీప్ మ్యాజిక్ చేశాడా? ప్రిన్స్ టాక్ ఏంటంటే!

    |

    తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల్లో కొంత మందికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో యంగ్ హీరో శివకార్తికేయన్ ఒకడు. ఈ మధ్య కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. ఇటీవలి కాలంలో 'వరుణ్ డాక్టర్', 'డాన్' వంటి చిత్రాలతో తెలుగులోనూ విజయాలు అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో నేరుగా 'ప్రిన్స్' అనే సినిమాను చేశాడు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి పండుగ కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో 'ప్రిన్స్' ట్విట్టర్ రివ్యూను మీరే చూడండి!

     ప్రిన్స్‌గా వచ్చిన శివకార్తికేయన్

    ప్రిన్స్‌గా వచ్చిన శివకార్తికేయన్

    కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన ద్విభాషా చిత్రమే 'ప్రిన్స్'. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్యా భామ మారియా రియాబోషప్క హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించారు.

    Ori Devuda Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. వెంకటేష్ రోల్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!Ori Devuda Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. వెంకటేష్ రోల్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

    అలాంటి కథ.. యమ కామెడీతో

    అలాంటి కథ.. యమ కామెడీతో

    ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తోన్న రష్యా యువతిపై హీరో ప్రేమలో పడడం.. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా కష్టాలు పడడం.. చివరికి ఈ ప్రేమకథను రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మార్చడం అనే అంశాలతో 'ప్రిన్స్' మూవీ తెరకెక్కింది. దీన్ని మన జాతిరత్నం అనుదీప్ తనదైన శైలి కామెడీ జోనర్‌లో తెరకెక్కించాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

    ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే

    తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'పిన్స్' మూవీ దీపావళి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన షోలు ఇప్పటికే యూఎస్, తమిళనాడు సహా చాలా ప్రాంతాల్లో ప్రదర్శితం అయ్యాయి. ఇక, ఈ సినిమా హిలీరియస్‌గా ఉందని ట్విట్టర్ ద్వారా చాలా మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

    చాలా భిన్నంగా ఉంటుందని

    'ప్రిన్స్' సినిమాను చూసిన ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్‌లో ఇలా ట్వీట్ చేశాడు. 'ఇలా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సమాచారం కోసం.. ఈ రకమైన కామెడీ చాలా భిన్నంగా ఉంది. కాబట్టి ఇది ఓ వర్గం వాళ్లకు నచ్చకపోవచ్చు. కానీ, ఇలాంటివి ఇష్టపడేవారికి మాత్రం నాన్‌స్టాప్‌గా ఫన్ అందిస్తూ, ఒత్తిడి తగ్గించే విధంగా ఉంది' అంటూ అందులో రాసుకొచ్చాడు.

    డాక్టర్ మ్యాజిక్ రిపీటైందంటూ


    శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' సినిమాను చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'స్టోరీ గ్రిప్పింగ్‌గా లేదు. కామెడీ కూడా 70 శాతం మాత్రమే ఉంది. కానీ, శివకార్తికేయన్, సత్యరాజ్ డబుల్ మ్యాన్‌ షోలు చేశారు. ఇందులో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ బోర్, సెకెండాఫ్ ఓకే. డాక్టర్ మ్యాజిక్ రిపీట్ అయింది. దీపావళికి సరైన ఎంటర్‌టైనర్' అని చెప్పుకొచ్చాడు.

    జంట చాలా ముద్దుగా ఉంది

    అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'సెకెండాఫ్ కంటే ఫస్టాఫ్‌లో కామెడీ బాగుంది. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కదిలించే విధంగా ఉంది. శివకార్తికేయన్ - మారియా జంట ముద్దుగా ఉంది. ఇందులో కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. సత్యరాజ్, ప్రేమ్‌జీ కూడా బాగా చేశారు' అంటూ ట్వీట్ చేశాడు.

    అనుదీప్ డైరెక్షన్‌ హైలైట్‌గా

    అనుదీప్ డైరెక్షన్‌ హైలైట్‌గా

    శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీని చూసిన తమిళ ప్రేక్షకులు దర్శకుడు అనుదీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'జాతిరత్నాలు వైబ్స్ 80 శాతం ఉన్నాయి. అనుదీప్ ట్రీట్‌మెంట్ వర్కౌట్ అయింది. సెకెండాఫ్‌లో 20 నిమిషాలు స్లోగా ఉన్నా అనుదీప్ వల్ల డీసెంట్ ఫిల్మ్‌గా మారిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Sivakarthikeyan Did Prince Movie Under Anudeep KV Direction. Lets See This Movie Twitter Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X