»   » ‘సైజ్ జీరో’ సెన్సార్: తమిళంలో క్లీన్, తెలుగులో నాట్ క్లీన్!

‘సైజ్ జీరో’ సెన్సార్: తమిళంలో క్లీన్, తెలుగులో నాట్ క్లీన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైజ్ జీరో'. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్టెనర్ గా సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగు సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ' సర్టిపికెట్ జారీ చేసింది. అయితే తమిళ సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం ఈ సినిమాకు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం.

size zero

మరి తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్ లలో ఏవైనా తేడా ఉందా? సినీ వర్గాల్లో ప్రాచారం జరుగుతున్నట్లు తెలుగు వెర్షన్లో ఆర్య, అనుష్క మధ్య రొమాంటిక్ ముద్దు సీన్లు ఉన్నాయా? తమిళంలో అలాంటి సీన్లు కట్ చేసి సెన్సార్ కు పంపడం వల్లే క్లీన్ సర్టిఫికెట్ వచ్చిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇక ఇతర వివరాల్లోకి వెళితే..సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు 1 కేజీ బంగారం కాంటెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు సోమవారం ప్రసాద్ లాబ్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిర్మాత పరమ్ వి.పొట్లూరి మాట్లాడుతూ సినిమాను నిర్మించడమే కాదు దాని ప్రమోసన్స్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రమోషన్స్ లో భాగంగా కార్వీ వారి సహకారంతో ‘1 కేజీ బంగారం గెలవండి' కాంటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సినిమా టికెట్ తో పాటు 11 డిజిట్స్ ఉండే ఓ కూపన్ ఇస్తాం. ఆకోడ్ ను పివిపి సినిమా.కామ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆ కూపన్ లో ఇచ్చిన 95454 66666 అనే మొబైల్ నంబర్ కు 11 అంకెల కోడ్ ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఇలా పంపిన ఆడియన్స్ నుండి 20 మందిని సెలక్ట్ చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. అలాగే ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్ కు 1 కేజీ బంగారం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

English summary
Anushka’s Size Zero censor formalities of both Telugu and Tamil versions have been completed. Latest update reveals that the Tamil version got a clean ‘U’ where as the Telugu part got an U/A.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu