»   » స్నేహ క్రికెట్ ఆడింది...భర్త తో కలిసి : తల్లిలా ఆలోచించాకే ఇలా అని

స్నేహ క్రికెట్ ఆడింది...భర్త తో కలిసి : తల్లిలా ఆలోచించాకే ఇలా అని

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన స్మైలింగ్‌ బ్యూటీ స్నేహ అవకాశం వచ్చినప్పుడల్లా తన పెద్దమనసును చాటుకుంటూనే ఉంది. తాజాగా ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం నిధులు సేకరించేందుకు ఆమె క్రికెటర్‌గా మారింది. బ్యాట్‌ చేత పట్టి మైదానంలో బౌండరీలు కొట్టి చిన్నారుల్లో ఆనందాన్ని నింపింది.

Sneha and Prasanna plays Cricket with Chennai 28 Team

రీసెంట్ గా చెన్నైలో హెచ్ఐవీ బాధితుల సహాయార్థం స్వచ్ఛంద సంస్థల కోసం నిధుల సేకరణ జరిగింది. ఇందులో భాగంగా జస్ట్ క్రికెట్ పేరుతో క్రీడా పోటీల్ని నిర్వహించారు. నెల రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన 32 జట్లు పాల్గొన్నాయ్. ఫైనల్ మ్యాచ్ ని నందనంలోని వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు చేయగా.. దీనికి గెస్ట్ లుగా వచ్చిన సినీ కపుల్స్ స్నేహా ఆమె భర్త ప్రసన్న సరదాగా క్రికెట్ ఆడారు. ప్రసన్న బ్యాటింగ్ చేసినప్పుడు స్నేహా బౌలింగ్.. స్నేహా బ్యాటింగ్ కు ప్రసన్న బౌలింగ్ చేసి చూడటానికి వచ్చిన వాళ్లని ఎంటర్టైన్ చేశారు.

గత నెల 27వ తేదీన ప్రారంభమైన నిధి సేకరణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌ ఆదివారం చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగింది. ఈ పోటీలను తిలకించేందుకు క్రీడారంగం నుంచే కాకుండా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో నిర్మాత ఆర్‌కే సురేష్‌, దర్శకులు దురై, మీరా కదిరవన్, నటులు శ్యామ్‌, భరత్, శ్రీకాంత్, ప్రసన్న, ప్రిజన్, గోలీసోడా కిషోర్‌, మాస్టర్‌ మహేంద్రన్, దీనా, నటీమణులు స్నేహ, సంగీత తదితరులు వున్నారు. అలాగే క్రికెట్‌ నేపథ్యంతో తెరకెక్కిన 'చెన్నై 28-2' తారాగణం మొత్తం హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా ఎయిడ్స్‌ బాధిత చిన్నారులతో స్నేహ క్రికెట్‌ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

Sneha and Prasanna plays Cricket with Chennai 28 Team

వాళ్ళేం తప్పుచేసారో వాళ్ళకే కాదు మనకూ తెలియదు, మరణశిక్ష పడేంత నేరం వాళ్ళేం చేసారని? వాళ్ళకోసం మనప్రాణాలిచ్చే వీలు లేదు కనీసం వాళ్ళకి పనికి వచ్చే విధంగా ఏదైనా చేద్దాం అని ప్రయత్నిచిన నిర్వాహకులకి ఒక వందనం, నాలో నూ ఒక అమ్మ ఉంది ఆ పిల్లలని చూసినప్పుడు నేను చేసిన ఈ పని కూడా చాలా చిన్నదేమో అనిపించింది అని చెప్పింది స్నేహ

English summary
heroine Sneha and her husband Prasanna have stole the show. Not just appearing as audiences, but they too have played the game of cricket as well. While Sneha has first batted when Prasanna bowled, later she too bowled while Prasanna took the bat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu