»   »  నాగచైతన్య సరసన స్నేహా ఉల్లాల్?

నాగచైతన్య సరసన స్నేహా ఉల్లాల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sneha Ullal
ఐశ్వర్యారాయ్ పోలికలు ఉన్న స్నేహా ఉల్లాల్ ఇప్పుడు టాలీవుడ్ కి హాట్ టార్గెట్. ఆమె చేసిన 'ఉల్లాసంగా ...ఉత్సాహంగా' మంచి టాక్ తెచ్చుకోవటంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. అందమే కాక టాలెంటు కూడా ఆమెలో ఉందని గ్రహించిన దర్శక,నిర్మాతలు ఆమెని ఎప్రోచ్ అవుతున్నారు. అయితే ఇప్పుడో స్పెషల్ న్యూస్ ఆమె పేరు మీద చలామణి అవుతోంది. అది ఆమెని నాగార్జున కుమారుడు నాగచైతన్య పరిచయ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసారని.

వాసువర్మ అనే నూతన దర్శకుడు దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అందులోనూ 'ఉల్లాసంగా ...ఉత్సాహంగా' చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయటం జర్గింది. గతంలోనూ పూరీతో కలసి నిర్మించిన 'హలో ప్రేమిస్తారా' చిత్రంలోని హీరోయిన్ షీలాని రాజు తన 'పరుగు' చిత్రానికి ఎంపికచేసారు.అలాగే లక్కీగా 'లక్కీ' చిత్రం (స్నేహా ఉల్లాల్ ప్రారంభ చిత్రం )తర్వాత పెద్ద ఆఫర్స్ ఆమె వెంట పడలేదు .కాబట్టి బాలీవుడ్ కి ఇప్పట్లో వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక్కడే సెటిలయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X