»   » కుట్రకు బలైపోతావు జాగ్రత్త.... హీరోయిన్ మీద స్టార్ డైరెక్టర్ పరోక్ష దాడి?

కుట్రకు బలైపోతావు జాగ్రత్త.... హీరోయిన్ మీద స్టార్ డైరెక్టర్ పరోక్ష దాడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కంగనా రనౌత్ చేసిన వీడియో సాంగ్ 'బాలీవుడ్ దివా' సంచలనం అయిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ల మీద.... కరణ్ జోహార్ లాంటి డైరెక్టర్ల మీద వేసిన డైరెక్ట్ సెటైర్ అంటూ బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కరణ్ జోహార్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యాయి. 'డియర్ టాలెంట్... నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, భ్రమ నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను.... వారు నీపై నిరంతరాయంగా కుట్ర చేస్తారు. గమనించడం లేదా?' అంటూ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. కరణ్ జోహార్ ఈ ట్వీట్ ద్వారా కంగనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

కంగనా రనౌత్ తన వీడియో ద్వారా కరణ్ జోహార్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ల మీద వ్యంగాస్త్రాలు విసరడం చర్చనీయాంశం అయింది. ఇలాంటి సాహసం చేయడం కేవలం ఆమె వల్ల మాత్రమే అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

పరోక్ష దాడి

పరోక్ష దాడి

అలా ఆ పాట ద్వారా తమపై సెటైర్లు వేయడం కరణ్ జోహార్‌కు అస్సలు నచ్చనట్లు ఉంది. అందుకే అతడు ట్విట్టర్ ద్వారా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు. అయితే కరణ్ జోహార్ ఎక్కడా కూడా కంగనా పేరు మెన్షన్ చేయడక పోవడం గమనార్హం.

ఫన్నీ...

ఫన్నీ...

కంగనా రనౌత్ అంత ఓపెన్‌గా తన పాట ద్వారా ఎటాక్ చేస్తే.... కరణ్ జోహార్ ఇలా ఫన్నీగా పరోక్షంగా ట్వీట్లు చేయడం ఏమిటి అంటూ చర్చించుకుంటున్నారు.

ఆమె సిద్ధమే

ఆమె సిద్ధమే

కంగనా రనౌత్ చాలా స్ట్రాంగ్ లేడీ... ఎవరైనా తనపై మాటలదాడి చేస్తే డైరెక్టుగా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అందుకే కరణ్ జోహార్ ఆమెతో డైరెక్టుగా ఫైట్ చేయడానికి భయ పడుతున్నాడనే వాదన వినిపిస్తోంది.

హాట్ టాపిక్ అయిన కంగనా

హాట్ టాపిక్ అయిన కంగనా

ఇటీవల పలు ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్లపై వివాదాస్పద కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి భయం లేకుండా ఆమె హృతిక్, ఆదిత్య పంచోలి లాంటి వారిపై పలు ఆరోపణలు చేశారు.

అందుకే బాలీవుడ్ క్వీన్

అందుకే బాలీవుడ్ క్వీన్

నటన పరంగానే కాదు, యాటిట్యూడ్ పరంగా కూడా తాను క్వీన్ లాంటి దాన్నే అని కంగనా రనౌత్ పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ‘బాలీవుడ్ క్వీన్' అనే పదానికి ఆమె సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

సంచలన వీడియో ఇదే

బాలీవుడ్లో సంచలన అయిన కంగనా రనౌత్ వీడియో ఇదే. బాలీవుడ్లోని స్టార్లు, అక్కడి దర్శకులు, హీరోయిన్ల పట్ల వారు ప్రవర్తించే తీరుపై సెటైరిక్‌గా ఈ వీడియో చిత్రీకరించారు.

English summary
Kangana Ranaut made everyone chuckle with her latest video from AIB taking aim at Shahrukh Khan, Hrithik Roshan and Karan Johar and it looks like instead of directly attacking Kangana for her antics, Karan Johar has gone incognito and made a veiled attack against the Queen actress on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu