»   » ‘సోగ్గాడే..’ వాస్తవానికి చేయాల్సింది చిరంజీవితో, కానీ...

‘సోగ్గాడే..’ వాస్తవానికి చేయాల్సింది చిరంజీవితో, కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గేడే చిన్ని నాయనా' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.... రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్,ఇతర రైట్స్ కలిపి ఈ చిత్రం రూ. 50 కోట్లకు చేరువవుతుందని అంచనా.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. ఈ కథను ఆయన చిరంజీవితో చేయాలని అనుకున్నారట. కాని కొన్ని కారణాల వల్ల వీలే కాలేదు. తర్వాత నాగార్జునకు చెప్పడంతో కథ నచ్చి తానే నిర్మిస్తానని ముందుకు వచ్చారు. నాగార్జున తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు ఈ యువ దర్శకుడు.


Soggade Chinni Nayana first choice Chiru, but..

ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీసు రారాజు నాగార్జునే అని తేలి పోయింది. ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయానా' మాత్రమే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
As per a buzz, Kalyan Krishna who is a big fan of Megastar Chiranjeevi wanted to make Soggade Chinni Nayana with his favorite star. Owing to some reasons, he opted to make it with Nagarjuna who also produced the movie under Annapurna Studios Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu