»   » పరువు నిలబెడుతుందన్న నాగ్! (సోగ్గాడే చిన్ననాయనా ఆడియో ఫోటోస్)

పరువు నిలబెడుతుందన్న నాగ్! (సోగ్గాడే చిన్ననాయనా ఆడియో ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జునే స్వయంగా నర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళావేదికలో జరిగింది.

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవేంద్రరావు తొలి సీడీని విడుదల చేసారు. నాగార్జునకు తొలి సీడీ అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మనం' మూవీకి అనూప్ రూబెన్స్ చక్కటి సంగీతం అందించారు. మనంలో నాన్నగారితో పాటు నేను, చైతు, అఖిల్ అందరం కలిసి నటించాం. ఆ సినిమాతో నాన్నగారు మాకుదూరం అవుతూనే మీ అందరికీ దగ్గరయ్యారు. అలాంటి ‘మనం' మూవీ పరువు నిలబెట్టాలంటే ఎలాంటి సినిమా చేయాలని బాగా ఆలోచించి ఈ సినిమా చేసాం. ఆత్మీయత, అనుబంధాలతో కలిసి తెలుగు వాతావరణం ఉట్టిపడే సినిమా. హలోబ్రదర్ లాంటి ఎంటర్టెన్మెంట్ కూడా ఉంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నాం అన్నారు.


చైతన్య మాట్లాడుతూ...మనం తర్వాత వస్తున్న ఈ సినిమాపై కాలా కాన్ఫిడెన్సుగా ఉన్నాం. హలోబ్రదర్, నిన్నేపెళ్లాడతా సినిమాల్లా ఇదీ రికార్డు క్రియేట్ చేస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ...‘మనం' మూవీ చూడగానే ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో...ఇపుడు ఈ సినిమా చూడగానే అలాంటి ఫీలింగ్స్ కలిగాయి. నాన్నగారు పాతికేళ్ల క్రితం ఉన్న ఎనర్జీతో చేసారు. నాన్నగారిని పంచెకట్టులో చూసి స్టన్నయ్యాను అన్నారు. అమల మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత నాగార్జునతో రమ్య కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ కి, నాగ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.


స్లైడ్ షోలో ఫోటోస్...


సోగ్గాడే...

సోగ్గాడే...

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవేంద్రరావు తొలి సీడీని విడుదల చేసారు. నాగార్జునకు తొలి సీడీ అందించారు.


సంక్రాంతి విడుదల

సంక్రాంతి విడుదల


సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నాం అన్నారు నాగార్జున.


మనం పరువు నిలబెడుతుంది

మనం పరువు నిలబెడుతుంది

అలాంటి ‘మనం' మూవీ పరువు నిలబెట్టాలంటే ఎలాంటి సినిమా చేయాలని బాగా ఆలోచించి ఈ సినిమా చేసాం. ఆత్మీయత, అనుబంధాలతో కలిసి తెలుగు వాతావరణం ఉట్టిపడే సినిమా. హలోబ్రదర్ లాంటి ఎంటర్టెన్మెంట్ కూడా ఉంటుంది.


సోగ్గాడే చిన్ని నాయనా

సోగ్గాడే చిన్ని నాయనా

అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'.


అనూప్

అనూప్

నాగార్జునే స్వయంగా నర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం శిల్పకళావేదికలో జరిగింది.


నాగ చైతన్య

నాగ చైతన్య

హలోబ్రదర్, నిన్నేపెళ్లాడతా సినిమాల్లా ఇదీ రికార్డు క్రియేట్ చేస్తుంది అన్నారు నాగ చైతన్య.


మనం ఫీలింగ్

మనం ఫీలింగ్

‘మనం' మూవీ చూడగానే ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో...ఇపుడు ఈ సినిమా చూడగానే అలాంటి ఫీలింగ్స్ కలిగాయి అన్నారు అఖిల్.


నాగార్జున దేవుడు

నాగార్జున దేవుడు

దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తాడు. నాకు నాగార్జునగారి రూపంలో కనబడ్డారు అన్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఆర్ట్: ఎస్ రవీందర్, రచన: సత్యానంద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ


English summary
Akkineni Nagarjuna, Ramya Krishna, Lavanya Tripati acted Soggade Chinninayana Movie audio launch held at Shilpa Kala Vedika in Hyderabad on Friday (25th Dec) evening.
Please Wait while comments are loading...