»   » ప్రముఖ హీరో సోదరి గర్భవతి అట.. కరీనా కపూర్ నుంచి సలహాలు..

ప్రముఖ హీరో సోదరి గర్భవతి అట.. కరీనా కపూర్ నుంచి సలహాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీ ఖాన్, కునాల్ కేము దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే సోహ త్వరలోనే తల్లి కాబోతున్నదనదట. సోహా అలీఖాన్ గర్భవతి అని తెలిపే చిత్రాలు గత రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్, ప్రముఖ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే.

సంతోషంలో భర్త కేము

సంతోషంలో భర్త కేము

సోహా అలీఖాన్ గర్భవతి అనే విషయాన్ని భర్త కునాల్ కేము ధ్రువీకరించారు. తమ ఇంట్లోకి త్వరలోనే ఓ చిన్నారి అడుగుపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నాడు. గర్భవతి అయిన సోహాను కేము దగ్గరుండి సంరక్షణ బాధ్యతలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. సోహ, కునాల్ కేము ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.

అవును నిజమే

అవును నిజమే

సోహ అలీఖాన్ గర్భవతి అనే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు కేము స్పందిస్తూ మీరు అనుకొంటున్నది. వాస్తవమే. సోహ, నా కాంబినేషన్‌లో జాయింట్ ప్రొడక్షన్ రాబోతున్నది. అదే మా కుటుంబంలో మరో సభ్యుడు రాబోతున్నాడు అని కేము తనదైన శైలిలో స్పందించాడు.

కరీనాను ఆదర్శంగా తీసుకొని..

కరీనాను ఆదర్శంగా తీసుకొని..

సోహా అలీఖాన్ గర్భవతి కావడం ఓ కారణముందని జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. సైఫ్ సతీమణి, ప్రముఖ నటి కరీనా కపూర్ అదర్శంగా తీసుకొని బిడ్డకు తల్లి కావాలని సోహా నిర్ణయించుకొన్నదట. కరీనా మాదిరిగా సొంతంగా తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తలంపుతో ఉన్నట్టు సమాచారం.

. కరీనా నుంచి టిప్స్..

. కరీనా నుంచి టిప్స్..

గర్భవతిగా ఉన్నప్పుడు పాటించిన జాగ్రత్తలు, సూచనలను, సలహాలను వదిన కరీనా నుంచి తీసుకొంటున్నట్టు సమాచారం. గర్భవతిగా ఉంటూనే కరీనా మాదిరిగా షూటింగ్‌లో కూడా పాల్గొనేందుకు చర్యలు తీసుకొంటున్నది. మే నుంచి ‘వీరే ది వెడ్డింగ్' అనే సినిమా షూటింగ్‌కు హాజరుకానున్నట్టు సమాచారం. ఈ జనవరికి సోహ, కేము పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తయింది. గతేడాది అక్టోబర్ సోహ అలీ ఖాన్ నటించిన చిత్రం విడుదలైంది. కునాల్ కేము గో గోవా గాన్ సీక్వెల్ నటించాడు.

సిద్ధార్థ్‌తో బ్రేకప్..

సిద్ధార్థ్‌తో బ్రేకప్..

గతంలో దక్షిణాది హీరో సిద్ధార్థ్, సోహా అలీ ఖాన్‌ల మధ్య జోరుగా అఫైర్ సాగింది. రంగ్ దే బసంతి చిత్రం సందర్భంగా వీరిద్దరూ ప్రేమలో పట్టారు. అయితే వ్యక్తిగత బేధాల కారణంగా వారిద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఓ సారి సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే ఫంక్షన్‌లో సోహా, సైఫ్ విపరీతంగా గొడవ పెట్టుకొన్నట్టు బాలీవుడ్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

English summary
Actors Soha Ali Khan and Kunal Kemmu are expecting their first child together. Soha's husband Kunal Kemmu has confirmed that Soha is pregnant and that the couple is excited to have their first child. He said "Yes it's true. Soha and I are very happy to announce a joint production coming later this year - our first child! We feel blessed and thank you all for your good wishes."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu