twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సోలో'గానే చెలరేగి (ప్రివ్యూ)

    By Srikanya
    |

    బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ మలి చిత్రం సోలో. రవితేజతో ఆంజనేయులు రూపొందించిన దర్శకుడు పరుశురామ్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నారా రోహిత్ గౌతమ్ అనే పాత్రలో కనిపిస్తారు. కథలో.. గౌతమ్‌ (నారా రోహిత్‌) అనాధ.ఓ పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. ప్రెండ్స్, హ్యాపీగా లైప్ ఉన్న అతనికి ఆప్యాయతను పంచే తోడు మాత్రం లేదు. ఆ సమయంలో విజయనగరం కు చెందిన వైష్ణవి (నిషా అగర్వాల్‌) అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ చదువుకోవడానికి వస్తుంది. వైష్ణవి పరిచయం గౌతమ్‌ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. ఆమెతోనే తన జీవితం పంచుకోవాలనుకొంటాడు. మరి గౌతమ్‌ ప్రేమ ఫలించిందా? వైష్ణవి ఇంట్లోవాళ్లు ఎలా స్పందించారు? అనే విషయాలు తెర మీద చూసి తెలుసుకోవలసిందే.

    ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ కథకు ప్రేరణ. పదేళ్ల కుర్రాడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఏదో ఒక పాత్రలో తమని తాము చూసుకొంటారు. ప్రేమ, కుటుంబ బంధాలూ, వినోదం ఇవన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రకాష్‌రాజ్‌, జయసుధల నటన అందరికీ నచ్చుతుంది. మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణ'' అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరో క్యారక్టరైజేషన్ ప్రధానంగా కథ సాగుతుంది. కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో డైలాగులు బయిట పాపులర్ అయ్యాయి.'పోయేటప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది కానీ... పుట్టినప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది"అనే డైలాగు ఇప్పటికే పాపులర్ అయ్యింది.

    సంస్థ: యస్వీకే సినిమా
    నటీనటులు: నారా రోహిత్‌, నిషా అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీ షిండే, ఎమ్మెస్‌ నారాయణ, అలీ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌
    దర్శకత్వం: పరశురామ్‌
    విడుదల: శుక్రవారం.

    English summary
    Nara Rohit's latest film Solo Releasing today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X