»   » కొన్ని అసలు మారవు: పెదాల మీద ముద్దుతో ఇలా చెప్పింది రాధిక

కొన్ని అసలు మారవు: పెదాల మీద ముద్దుతో ఇలా చెప్పింది రాధిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది సీనియర్ నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే, తన నటనా కౌశల్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాధిక పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించిన రాధిక, రాడాన్ అనే సంస్థ ద్వారా పలు టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తోంది. రాధిక ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ, నిర్మాతగా కూడా రానిస్తున్నది.

Something's never change, actress radhika

శరత్ కుమార్ ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న ఆమె అటు ఫ్యామిలీ లైఫ్ లోను, ఇటు బిజినెస్ లోను ఫుల్ బిజీ అయింది. అయినా తన కూతురుని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు రాధిక . రాధికకు లండన్ భర్త ద్వారా జన్మించిన రేయాన్ ని శరత్ కుమార్ తో రాధిక వివాహం తర్వాత కూడా చక్కగానే చూసుకుంది.

Radhika Apte' s Bold Role in Hindi Movie Parched - Filmibeat Telugu
Something's never change, actress radhika

ఇంతకీ, అసలు విషయమేమిటంటే.. తన కూతురు చిన్నారి రేయాన్తో కలిసి కొన్నేళ్ల క్రితం దిగిన ఓ ఫొటోను, రేయాన్ పెరిగి పెద్దయిన తర్వాత తాజాగా దిగిన మరో ఫొటోను రాధిక పోస్ట్ చేసింది. ఆ ఫొటోల ప్రత్యేకత ఏంటంటే.. చిన్నారి రేయాన్ను ముద్దాడుతున్న ఫొటో ఒకటి కాగా, రేయాన్ పెళ్లి వేడుకలో ఆమెను ప్రేమగా రాధిక ముద్దుపెట్టుకుంటున్న ఫొటో మరోటి. ఈ రెండు ఫొటోలను పోస్ట్ చేసిన రాధిక, 'కొన్ని అసలు మారవు. నా ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉంటుంది' అని తన ట్వీట్ లో పేర్కొంది. కాగా, గత ఏడాది ఆగస్టులో రేయాన్ వివాహం క్రికెటర్ అభిమన్యు మిథున్ తో జరిగింది.

English summary
"Something's never change, my love will always be the same forever " Tweets Radhika
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu